కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నమైంది. దాదాపు అన్ని దేశాల్లో లాక్‌డౌన్ అమలవుతుండడంతో చిల్లర వర్తకం మినహా ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు, మార్కెటింగ్ కొనసాగడం లేదు. దీంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న సంఘటనలు చూస్తున్నాం. ఇన్నాళ్లు ఫుల్ జోష్‌లో ఉన్న రంగాలు కూడా ఇప్పుడు కుదేలవుతున్నాయి. ఇప్పుడు నిర్మాణ రంగం భారీగా క్షీణించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆగిపోయాయి. దాదాపు 50 శాతం మేర క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ పై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. దేశంలోనే ఏ నగరంలో లేని విధంగా హైదరాబాద్‌లో 50 శాతం క్రయవిక్రయాలు క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇళ్ల విక్రయాలు మందగించాయి.
గతేడాది జనవరి- మార్చి (క్యూ 1) సమయంలో ఒక్క హైదరాబాద్‌లోనే 5,400 ఇళ్ల విక్రయాలు జరిగాయి. అదే ప్రస్తుతం ఈ సమయంలో 2,680 ఇళ్లు విక్రయానికి వచ్చాయి. దాదాపు సగం మేర ఇళ్ల విక్రయాల్లో తేడా ఉంది. అయితే దీనికి కారణం కరోనా వైరస్సే. ఎందుకంటే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలో వారు ఇంట్లో ఉండడానికే ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథంలో ఎలాంటి కొనుగోళ్లు చేయాలని భావించడం లేదు. దీనికి తోడు నిర్మాణంలో ఉన్న భవనాలు, ఇంటి నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో కొత్త ఇళ్లు అందుబాటులో లేవు. దీంతో ఇళ్ల విక్రయాలు ఆగిపోయాయి. ప్రస్తుతం ఈ పరిస్థితి మరో రెండు నెలల దాక ఉంటుందని తెలుస్తోంది.
హైదరాబాద్‌తో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. బెంగళూర్, ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కత్తా లో గృహ విక్రయాలు భారీగా తగ్గిపోయాయి. ఇక్కడ దాదాపు 24శాతం ఇళ్ల విక్రయాలు క్షీణించాయి. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి కోలుకోవాలంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందేనని రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.