అల్లకల్లోలంగా అమెరికా.. కరోనాతో మరణమృదంగం

Update: 2020-04-02 07:15 GMT
కరోనాకు అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. రోజురోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరుగుతుండడం తో అగ్రరాజ్యం అతలాకుతలం అవుతోంది. మృతుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

నిన్న ఒక్కరోజే అమెరికాలో ఏకంగా 884 మంది మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తాజాగా దేశంలో కరోనా ధాటికి 2.40లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని తెలుపడం కలకలం రేపింది.  దీన్ని బట్టి ప్రపంచంలోనే అత్యంత మెరుగైన వైద్య సేవలున్న అమెరికా కరోనాను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమైందని అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటివరకు అమెరికాలో మొత్తం 215215 కేసులకు పైగా నమోదయ్యాయి. తాజాగా చోటు చేసుకున్న మరణాలతో కలిపి అమెరికాలో మొత్తం 5110మంది మరణించారు.

ఇక ఇటలీ, స్పెయిన్ లను కరోనా వణికిస్తోంది. ఇటలీలో 13వేలకు పైగా మంది.. స్పెయిన్ లో 9వేలకు పైగా మంది మరణించారు.  ఇక కరోనా పుట్టిన చైనాలో పరిస్థితి పూర్తి అదుపులోకి వచ్చింది. నిన్న ఎటువంటి మరణాలు చోటుచేసుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశంలోనూ కరోనా సోకిందని డబ్ల్యూ హెచ్ ఓ తెలిపింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ 9.35 లక్షల మందికి సోకిందని తెలిపింది.
Tags:    

Similar News