కరోనా వైరస్‌కు అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలమవుతోంది. ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. దానికి అనుగుణంగా కరోనా బాధితులు మృత్యువాత పడుతున్నారు. పరిస్థితి ఎప్పుడో చేయి దాటిపోయింది. ఈ నేపథ్యంలో మరణాలు పెరుగుతుండగా మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చాలడం లేదు. దీంతో అమెరికా లో శవాల కుప్పలు పేరుకుపోయాయి. కరోనా కేసులు దాదాపు మూడు లక్షలకు చేరువగా ఉండగా మృతుల సంఖ్య 8 వేలకు చేరువవుతోంది.
కరోనా బాధితుల మరణమృదంగం మోగుతూనే ఉంది. సత్వరం వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడం.. పటిష్ట చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం అమెరికాలో కరోనా మూడో దశకు ఎప్పుడో చేరింది. దీంతో వైరస్ వేగంగా ప్రజలకు సంక్రమిస్తోంది. దీంతో ఆ వైరస్ బారిన లక్షల సంఖ్యలో ప్రజలు పడుతున్నారు. అయితే అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియాలో మరింత తీవ్రంగా ఉంది. న్యూయార్క్ ఒక్క నగరంలోనే దాదాపు 1,500 మంది మృతి చెందడం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ మృతదేహాల ఖననం చేసేందుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. శ్మశాన వాటికలకు మృతదేహాలు పోటెత్తుతుండడంతో వాటి నిర్వాహకులు అంత్యక్రియలు చేయలేక పోతున్నారు.
దీంతో మృతదేహాల ఖననానికి కొత్త విధానం అనుసరిస్తున్నారు. టోకెన్ పద్ధతి లేదా.. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ లేదా మరో విధానం లో మృతదేహాల ఖననం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు మృతదేహాలను ఆస్పత్రుల్లోనే ఉంచాలని మృతుల కుటుంబసభ్యులకు స్థానిక అధికారులతో పాటు శ్మశానాల నిర్వాహకులు సూచిస్తున్నారు. అమెరికాలోని ప్రధాన రాష్ట్రాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. అంత్యక్రియలు ఆలస్యమవుతుండడంతో అమెరికాలో మృతదేహాలు పేరుకుపోతున్నాయి. కరోనాతో మృతిచెందిన వారి దేహాలను ఇళ్లల్లో ఉంచుకోకుండా ఆస్పత్రుల్లోనే భద్రపరుస్తున్నారు. ఆస్పత్రుల్లో మృతదేహాలు ఉండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే అమెరికాలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం తో మృత దేహాలను తీసుకెళ్లేందుకు కవర్ల కొరత ఏర్పడింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ మృతదేహాల కవర్లు తయారు చేయాలని పలు కంపెనీలు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ మేరకు కవర్ల ఉత్పత్తి తీవ్రం చేస్తున్నారు. ఈ విధంగా అమెరికాలో పరిస్థితి ఉంది.
ప్రస్తుతం ఇప్పటివరకు అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు 2,77,475 నమోదు కాగా 7,402 మంది మృతిచెందారు.