ఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. అమెరికాలో మరణమృదంగాన్ని మోగిస్తోంది. ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా దారుణమైన రీతిలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనాలోని మరో కోణం అమెరికాలో బయటకు వచ్చింది. ప్రపంచంలో మరే దేశంలో లేనంత తీవ్రత అగ్రరాజ్యంలో కనిపిస్తోంది. కరోనాకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ వ్యవహరించే మొండివైఖరి.. చివరకు అమెరికన్ల ప్రాణాల్ని పెద్ద ఎత్తున తీసేస్తుంది.
అమెరికాలో అంతకంతకూ పెరిగిపోతున్న మరణాలు దీనికి నిదర్శనంగా చెప్పక తప్పదు. ఇప్పటివరకూ రెండు ప్రపంచ యుద్ధాలే కాదు.. మరే సందర్భంలోనూ అమెరికాకు కరోనా కారణంగా నష్టం వాటిల్లలేదని చెప్పక తప్పదు. తాజాగా జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ లెక్కల ప్రకారం గురువారం రాత్రికి (ఆదేశ కాలమానం ప్రకారం) 24 గంటల వ్యవధిలో 4,491 మంది మరణించినట్లుగా తేల్చింది.
దీంతో.. ఇప్పటివరకూ కరోనా కారణంగా అమెరికా లో మరణాలు 32,917కు చేరాయి. కరోనా విరుచుకుపడిన నాటి నుంచి 24 గంటల వ్యవధిలో ఇంత భారీగా మరణాలు చోటు చేసుకోవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. తాజాగా వెల్లడించిన లెక్కల్లో మరణాల సంఖ్యతో పాటు.. కరోనా అనుమానిత మరణాల్ని కలిపి లెక్కించటంతో ఈ సంఖ్య ఇంత భారీగా ఉందని చెబుతున్నారు.
ఇప్పటివరకూ అనుమానిత మరణాల్ని లెక్కలోకి తీసుకోలేదు. గురువారం నాటి నుంచి మరణాల్ని లెక్కించే తీరులో మార్పులు తీసుకొచ్చారు. అమెరికా లో మొత్తం బాధితుల సంఖ్య 6.67లక్షలుగా తేల్చారు. గడిచిన రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కరోనా మరణాల్లో అగ్రస్థానం అమెరికాది కాగా.. రెండో స్థానంలో ఇటలీ నిలిచింది. ఆ దేశంలో ఇప్పటివరకూ 22,170 మంది మరణించారు. మూడో స్థానంలో స్పెయిన్(19,130) .. ప్రాన్స్ (17,920) నాలుగో స్థానంలో నిలిచాయి.
అమెరికాలో కరోనా మరణాలకు కేంద్రంగా మారిన న్యూయార్క్ మహా నగరంలో ఇప్పటి వరకూ 12వేల మంది మరణించారు. ఒక దేశంలోని ఒక మహానగరంలో వేలాదిగా మరణించటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఈ గణాంకాల్ని చూస్తే.. రానున్న రోజుల్లో మరణాల తీవ్రత మరెలా ఉంటుందో అంచనా వేయటానికే భయం కలిగించేలా ఉన్నాయని చెప్పక తప్పదు. నిన్నటి వరకూ స్వర్గధామంగా చెప్పే అమెరికాలో కరోనా మోగిస్తున్న మరణమృదంగం ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేస్తోంది.