ఏపీలో కరోనాకు మొండితనం అంత ఎక్కువట

Update: 2020-04-21 06:20 GMT
కరోనాకు సంబంధించిన లెక్కలు ఏపీలో ఫెయిల్ అవుతున్నాయి. సాధారణంగా కరోనా పాజిటివ్ అన్న వెంటనే.. ఐసోలేషన్ వార్డుకు తరలించటం.. చికిత్స షురూ చేయటం తెలిసిందే. పేషెంట్ ఎవరైనా పద్నాలుగు రోజుల్లో కరోనా నుంచి బయటపడే అవకాశాలే ఎక్కువ. పెద్ద వయస్కులకు కాస్త సమయం తీసుకున్నా.. చిన్న వయసులో ఉన్న వారు.. ఆరోగ్య సమస్యలు లేని వారు కరోనా బారిన పడినా.. కోలుకునేందుకు వారం నుంచి పది రోజులు సమయం సరిపోతుందని.. పద్నాలుగు రోజుల్లో నెగిటివ్ రిపోర్టులు రావటం మామూలే. అందుకు భిన్నమైన పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి.

ఏపీలో కరోనా సోకిన రోగులు పద్నాలుగు రోజుల చికిత్స తర్వాత కూడా వారి రిపోర్టులు నెగిటివ్ గా రాకపోవటం ఆందోళనకు గురి చేస్తోంది. చికిత్స ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాత నుంచి పరీక్షలు నిర్వహిస్తుంటారు. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి పరీక్షలు నిర్వహించి.. కరోనా వైరస్ స్టేటస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వీలైనంతవరకూ ఎక్కువ కేసులు 14 నుంచి 16 రోజుల్లోనే డిశ్చార్జి చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా ఇప్పుడు ఏపీలో ఉన్న కేసుల్లో చాలావరకూ 19రోజుల తర్వాత కూడా నెగిటివ్ రిపోర్టులు రాకపోవటంతో ఏం చేయాలో అర్థం కాక కిందామీదా పడుతున్నారు. అయితే.. ఇలాంటి పరిస్థితి అందరి విషయంలో లేకున్నా.. కొందరి విషయంలో మాత్రం ఉందని తెలుస్తోంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తక్కువే.

ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం చూసినప్పుడు 536 మంది కరోనా బాధితులు 20 రోజుల తర్వాత కూడా నెగిటివ్ రిపోర్టు రాలేదు. దీంతో.. వారికి చికిత్స కంటిన్యూ చేస్తున్నారు. కరోనాకు మందు లేనప్పటికీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని జాగ్రత్తల మధ్య మందులు ఇస్తున్నారు. సాధారణంగా ఈ మందుల ప్రభావంతో పద్నాలుగు రోజుల్లో డిశ్చార్జి అవుతున్నారు.అందుకు భిన్నంగా ఇరవై రోజుల తర్వాత కూడా కరోనా కేసులు కొలిక్కి రాకపోవటంతో ఏపీలోని కరోనా మొండిదా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చికిత్స ఎందుకింత ఆలస్యమవుతుందన్నది ప్రశ్నగా మారుతోంది.
Tags:    

Similar News