క్యాలెండర్లో రోజులు గడుస్తున్న కొద్దీ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 42వేల మార్కును దాటింది. ఈ కేసుల్లో 55 శాతం పాజిటివ్ లు కేవలం మూడు రాష్ట్రాలకు చెందినవే కావటం గమనార్హం. మిగిలిన దేశాలతో పోలిస్తే దేశంలో మరణాల సంఖ్య తక్కువగా ఉండటమే కాదు.. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
సోమవారం ఒక్కరోజులో 2573 కరోనా కేసులు నమోదు కాగా.. 83 మంది మరణించారు. కోలుకుంటున్న వారి సంఖ్య ఒక్కరోజులోనే 27.03 శాతం నుంచి 27.45 శాతానికి చేరటం గమనార్హం. మొత్తం 42వేల కేసుల్లో (కచ్ఛితంగా చెప్పాలంటే 42,836) మహారాష్ట్ర.. గుజరాత్.. ఢిల్లీలోనే సగానికి పైగా కేసులు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక కేసులు ఢిల్లీలో మహానగరంలో చోటు చేసుకున్నాయి.
దేశంలోని మరణాలు కూడా ఈ మూడు రాష్ట్రాల్లోనే ఎక్కువ. దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న కరోనా మరణాల్లో ఈ మూడు రాష్ట్రాలకు చెందిన వారు ఏకంగా 64.9 శాతం ఉండటం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా సోమవారం నాటికి మొత్తం కేసులు 36 లక్షలు కాగా.. అందులో అమెరికా వాటానే 12 లక్షలు. తర్వాతి స్థానంలో స్పెయిన్ నిలిచింది. ఆ దేశంలో 2.48లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాకారణంగా మరణించిన వారు 2.50లక్షలమంది కాగా.. ఒక్క అమెరికాలోనే 69,116 మంది మరణించారు.
దేశీయంగా చూస్తే.. దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రం మహారాష్ట్రగా నిలిచింది. ఎక్కువ కేసులు నమోదైన టాప్ 12 రాష్ట్రాల్లో పన్నెండో స్థానంలో జమ్ముకశ్మీర్ నిలిచింది. కేసుల నమోదులో ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిస్తే.. తెలంగాణ పదో స్థానంలో నిలిచింది. దేశంలో అత్యధిక కేసులునమోదైన రాష్ట్రాల్లో ఉత్తరాదికి చెందిన రాష్ట్రాలే ఎక్కువగా ఉండటం గమనార్హం. మొత్తం పన్నెండు రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాలు ఉత్తరాదికి చెందినవి అయితే.. మూడు దక్షిణాది రాష్ట్రాలుగా చెప్పాలి. మరణాల విషయంలోకి వస్తే మహారాష్ట్రంలో అత్యధికంగా 548 మంది మరణిస్తే.. తర్వాతి స్థానం గుజరాత్ లో 290 మంది మరణించారు. మూడో స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచింది. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. కేసులు ఎక్కువగా నమోదైనా.. మరణాలు తక్కువగా ఉన్న రాష్ట్రంగా ఢిల్లీని చెప్పాలి. ఆ రాష్ట్రంలో 4,549 మంది కరోనా పాజిటివ్ తేలగా.. కరోనా మరణాలు 64 మాత్రమే కావటం గమనార్హం.