భారత్ లో కరోనా విజృంభణ ...ఒక్క రోజే 103 మంది మృతి !

Update: 2020-05-08 05:45 GMT
భారతదేశం లో కరోనా మహమ్మారి ఇప్పట్లో కట్టడిలోకి వచ్చేలా కనిపించడంలేదు. ఎందుకు అంటే ..కరోనా భాదితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది తప్ప , తగ్గడం లేదు. కరోనా కట్టడి కోసం దేశంలో ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కూడా కరోనా భాదితులు పెరుగుతూనే ఉన్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,390 కరోనా కేసులు నమోదుకాగా, 103 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 56,342కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.  

కాగా, నిన్న ఒక్కరోజే  1273 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 37,916 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తంగా 16,539 మంది కోలుకున్నారు. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా మొత్తం 1886 మంది చనిపోయారు. కేవలం మహారాష్ట్రలోనే 694 మంది మృతి చెందారు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ భాగం మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడులలోనే ఉన్నాయి. ఈ నాలుగు చోట్ల దాదాపు 36వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 17, 974 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

గుజరాత్‌ లో 7,012, ఢిల్లీలో 5,980, తమిళనాడులో 5,409, రాజస్తాన్‌ 3,427, మధ్యప్రదేశ్‌ 3,252, ఉత్తరప్రదేశ్ ‌లో 3,071 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ఏపీలో ఇప్పటి వరకు 1847 కేసులు నమోదు కాగా ..తెలంగాణ లో 1123 కేసులు నమోదు అయ్యాయి.
Tags:    

Similar News