ఇండోర్ ...మధ్యప్రదేశ్ లో ఉన్న ఈ నగరం దేశంలోనే స్వచ్ఛతలో అగ్రస్థానంలో ఉంది. వరుసగా మూడుసార్లు (2017, 2018, 2019 ) స్వచ్ఛతలో దేశంలోనే నంబర్ వన్ నగరంగా నిలిచింది. దానితో అక్కడ అమలు చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలను, స్వచ్ఛత కోసం పాటిస్తున్న నిబంధనలను తెలుసుకునేందుకు వివిధ నగరాలు అప్పట్లో ఇండోర్ కు క్యూ కట్టాయి. అయితే , స్వచ్ఛతలో అగ్రస్థానంలో ఉన్న ఈ నగరంలో కరోనా ప్రభావం పెద్దగా ఉండదులే అనుకుంటే పొరపాటే ...ఈ ఇండోర్ కరోనా కోరల్లో చిక్కుకొని , అల్లాడిపోతోంది .
స్వచ్ఛతలో లో అగ్రస్థానంలో నిలవడంతో ..అక్కడ అమలు చేస్తున్న విధివిధానాలను తెలుసుకోవడానికి జీహెచ్ ఎంసీ నుంచి సైతం పలువురు అధికారులు, పలు పర్యాయాలు ఇండోర్ ను సందర్శించి వచ్చారు. వీరిలో ఐఏఎస్ లు, అడిషనల్, జోనల్ కమిషనర్లు, చీఫ్ సిటీప్లానర్ సహా ఎందరో ఉన్నారు. ఇండోర్ లో అమలవుతున్న కార్యక్రమాల అధ్యయన యాత్రలకు జీహెచ్ ఎంసీ అప్పట్లో దాదాపు కోటి రూపాయలకి పైగానే ఖర్చు చేసింది. అయితే , స్వచ్చతలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న ఈ ఇండోర్ లో ఇప్పుడు కరోనా విజృంభించడంతో స్వచ్ఛ కార్యక్రమాల అమలులో గొప్ప గొప్ప నగరాలనే తలదన్నిన ఇండోర్ యంత్రాంగం కరోనాను ఎందుకు కట్టడి చేయలేక పోయిందన్నది అంతు పట్టడం లేదు.
కరోనా మహమ్మారి భారిన పడి అక్కడ దాదాపు 50 మంది మరణించారు. మార్చి 25న 4 పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్న ఇండోర్ లో ప్రస్తుతం 200 రెట్లకు మించి పోయాయి. ఇండోర్ నగరంలో సుమారు 900 కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనికి ప్రధాన కారణం లాక్ డౌన్,కంటైన్మెంట్ నిబంధనలు, సామాజిక దూరం పాటించకపోవడమే కారణం కావచ్చని జీహెచ్ ఎంసీలో ఒక చర్చ నడుస్తోంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. మొదటి నుండి ఇక్కడ అమలవుతున్న కంటెయిన్ మెంట్ నిబంధనలు, లాక్ డౌన్, సామాజిక దూరం వంటి వాటితోనే ఇండోర్ లాంటి పరిస్థితులు మన హైదరాబాద్ లో లేవని జీహెచ్ ఎంసీ అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
అలాగే , జీహెచ్ ఎంసీ లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 24వేల మంది కార్మికులు నగరప్రజల ఆరోగ్య భద్రతకు వీర సైనికుల్లా పని చేస్తున్నారని, అయినప్పటికీ.. ఇంకా మరింత అప్రమత్తంగా ఉండాలని.. మరింత పరిశుభ్రంగా, అన్ని ప్రాంతాలను మరింత స్వచ్ఛంగా ఉంచాలని అధికారులు కోరుతున్నారు. కరోనా మహమ్మారిని అరికట్టడంలో విఫలమైన స్వచ్ఛత సిటీ ఇండోర్ పాఠంతో హైదరాబాద్ నగర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అన్ని విధాలా ప్రభుత్వానికి సహకరించాలని జీహెచ్ ఎంసీ విజ్ఞప్తి చేస్తోంది.