రికార్డ్ కేసులు: ‌దేశంలో ఎప్ప‌డు లేన‌న్ని కేసులు ఒక్క‌రోజే

Update: 2020-05-01 10:10 GMT
దేశంలో క‌రోనా ప్ర‌వేశించి దాదాపు రెండు నెల‌లు దాటింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు న‌మోద కాన‌న్ని కేసులు ఒక్క శుక్ర‌వారం రోజు న‌మోద‌య్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఒకేసారి 1,993 పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఒకే రోజు ఇన్ని కేసులు రావ‌డం దేశంలో ఇదే తొలిసారి. తాజా కేసులతో క‌లిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 35,043కు చేరింది. ఇప్ప‌టివరకు దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 1,147 మంది మృతి చెంద‌గా, 8,889 మంది చికిత్స పొంది పూర్తిగా ఆరోగ్యంతో ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్‌ గా ఉన్న‌ కేసులు 25,007. అయితే దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లోనే క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

మహారాష్ట్రలో కరోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. ఒక్క రోజులోనే ఆ రాష్ట్రంలో కొత్తగా 583 కేసులు వెలుగుచూశాయి. వీటితో క‌లిపి ఆ ఒక్క‌రాష్ట్రంలోనే కరోనా కేసులు 10 వేలు దాటాయి. మొత్తం కేసులు 10,498కి చేరాయి. మ‌ర‌ణాలు కూడా అధికంగా ఉన్నాయి. మ‌ర‌ణాల్లో కూడా ఆ రాష్ట్రం ముందంజలో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 459 మంది మరణించారు. అనంత‌రం గుజరాత్ రెండో స్థానంలో ఉంది. తాజాగా 313 కరోనా కేసులు న‌మోదు కాగా మొత్తం కేసులు 4,395 ఉండ‌గా మ‌ర‌ణాలు 214 ఉన్నాయి.

ఇక క‌రోనా కేసుల్లో వాటి తర్వాత ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. క‌రోనా లెక్క‌ల‌ను ప‌రిశీలిస్తే ప్రస్తుతం దేశంలో ప్రతి వంద మంది కరోనా బాధితుల్లో ముగ్గురు మరణిస్తున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అయితే ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో మాత్ర‌మే క‌రోనా విజృంభిస్తోంద‌ని, ఆ రాష్ట్రాల్లో మాత్ర‌మే సంపూర్ణ లాక్‌డౌన్ కొన‌సాగించేలా ప‌రిణామాలు ఉన్నాయి.
Tags:    

Similar News