కరోనా కు బీమా ధీమా ఎంతో క్లారిటీ ఇచ్చేశారు

Update: 2020-03-06 04:18 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు సంబంధించిన చాలామందిలో తలెత్తే సందేహానికి సమాధానం లభించింది. కరోనా సోకితే.. దాని చికిత్సకు ఇప్పుడున్న హెల్త్ ఇన్సూరెన్స్ లు వర్తిస్తాయా? అన్నది చాలామందిలో కలిగే డౌట్. దీనికి సంబంధించి దేశంలోని నలభై నాలుగు సాధారణ బీమా కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే జనరల్ ఇన్సూరెన్స్ తాజాగా క్లారిటీ ఇచ్చేసింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న హెల్త్ పాలసీల్లోనే కరోనా వైరస్ చికిత్స కు బీమా కవరేజీ కల్పించాలని తేల్చి చెప్పారు. ఈ కేసుల్లో క్లెయింను త్వరితగతిన పరిష్కరించాలని బీమా కంపెనీల్ని ఈ కౌన్సిల్ కోరింది. దీంతో.. కరోనా చికిత్స కు అమల్లో ఉన్న ఆరోగ్య బీమా ధీమా? అంటుందా? ఉండదా? అన్న సందేహానికి చెక్ పెట్టినట్లైందని చెప్పాలి.

ఇప్పటికే కరోనా కు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాదు.. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్స చేసేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. కరోనా వైరస్ సోకినట్లు తేలితే.. అందుకు చేసే చికిత్స కు బిల్లు ఎంత వేయాలన్న విషయాన్ని తాము చెబుతామని.. ఆసుపత్రులు ఆ విషయాన్ని వదిలేయాలని తెలంగాణ రాస్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేయటం తెలిసిందే. ఇదే సమయం లో.. ఈ వైరస్ సోకితే.. బీమా ధీమా ఉందన్న అభయం ప్రజల్లో మరింత ధైర్యాన్ని ఇస్తుందనటంలో సందేహం లేదు.
Tags:    

Similar News