కరోనా ఎంత డేంజర్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కరి నిర్లక్ష్యం పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావటమే కాదు.. ప్రాణాల మీదకు తెస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తెలంగాణలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులు 1096 (మంగళవారం రాత్రి నాటికి).. అయితే.. ఈ కేసుల్లో అత్యధికంగా కొన్ని కుటుంబాల పుణ్యమేనని చెప్పాలి.
కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించే విషయంలో జరిగిన అలసత్వం.. పొరపాటు.. పరీక్షలు చేయించుకోకపోవటంతో పలువురికి వ్యాపించేలా చేసిందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో యాభై శాతానికి పైగా పాజిటివ్ లు కేవలం 209 కుటుంబాలకు చెందిన వారేనని చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో మూడు జిల్లాలు మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక.. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికం గ్రేటర్ పరిధిలోనివే.
మరో ఆసక్తికర కోణం ఏమంటే.. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధికం గ్రేటర్ హైదరాబాద్.. రంగారెడ్డి.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోనివే. మొత్తం 1100 కేసుల్లో 209కుటుంబాలకు చెందిన 626 కేసులు నమోదు కావటంతో తెలంగాణలో ఈ రోజు పాజిటివ్ కేసుల సంఖ్య ఇంత ఎక్కువగా ఉందని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలోని 89 కుటుంబాల్లో వచ్చిన పాజిటివ్ కేసులే అత్యధికంగా చెప్పాలి. మర్కజ్ కు వెళ్లి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా రావటం.. ఆ వ్యక్తితో ఆ ఉమ్మడికుటుంబంలో ఏకంగా 19 మందికి వ్యాపించటం చూస్తే.. కరోనా డేంజర్ ఎంత ఎక్కువన్నది ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.
అదే రీతిలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఒక వ్యక్తి పుణ్యమా అని వారి కుటుంబంలోని 14 మందికి కరోనా సోకింది. ఇక.. ఎల్ బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని పల్లీల వ్యాపారి కుటుంబంలో ఏకంగా పదకొండు మందికి సోకటం తెలిసిందే. హైదరాబాద్ తర్వాత అత్యధిక కేసులు సూర్యాపేట జిల్లా కాగా.. తర్వాతి స్థానం నిజామాబాద్ జిల్లా నిలుస్తుంది. ఆ జిల్లాలో మొతత్ం 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్ని కేవలం పది కుటుంబాలకు చెందిన వారే. తెలంగాణరాష్ట్రంలో లక్షల కుటుంబాలు ఉండగా.. కొన్ని కుటుంబాల్లోని వారి నిర్లక్ష్యం.. వైరస్ మీద అవగాహానరాహిత్యం ఈరోజు అందరూ ఇబ్బంది పడాల్సిన దుస్థితి. అందుకే.. ఎవరికి వారు అప్రమత్తంగా ఉండటంతోనే కరోనాను కట్టడి చేసే అవకాశం ఉందన్నది మర్చిపోకూడదు.