కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ మహమ్మారి గురించి కొత్త విషయం ఒకటి వెలుగుచూసింది. కరోనా స్త్రీ, పురుష బేధం లేకుండా అందరికీ సోకుతుందని.. అయితే మరణాల్లో మాత్రం ఒక స్పష్టమైన తేడా గుర్తించినట్టు చైనా వెల్లడించింది.
తాజాగా చైనాలో కరోనా వైరస్ సోకిన 72314మంది రోగుల నుంచి వివరాలు సేకరించారు. ఇందులో 51.4శాతం మంది పురుషులు, 48.6శాతం మంది మహిళలు వైరస్ బారిన పడ్డారు.
ఇందులో విశేషం ఏంటంటే 63.8శాతం మగవారు, 36.2శాతం మంది మాత్రమే మహిళలు మరణించినట్టు చైనా ప్రకటించింది.
ఇక మరో విషయాన్ని కూడా చైనా తెలిపింది. కరోనా వైరస్ పెద్దలతో పోలిస్తే చిన్నపిల్లల్లో చాలా తక్కువగా బయట పడుతున్నాయని తెలిపింది.
దీంతో కరోనా వైరస్ ఎక్కువగా మగవారికే డేంజర్ అని.. మహిళలు, చిన్నారులకు అంతగా ప్రాణాపాయం లేదని చైనా పరిశోధనలో తేల్చింది.