5,000 ఏళ్ల క్రితమే కరోనా తరహా వ్యాధి అంచనా..చరక సంహితలో ప్రస్తావన

Update: 2020-04-19 03:30 GMT
ఇప్పుడు యావత్తు ప్రపంచ దేశాలను వణికించేస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా... 5,000 ఏళ్ల క్రితమే మనలను అతలాకుతలం చేసిన వైనం తాజాగా బయటపడింది. భారత ఆయుర్వేదానికి ఆయువుపట్టుగా మారిన చరక సంహిత పుస్తకంలో కరోనా వైరస్ ను పోలిన వైరస్ ప్రస్తావన చాలా క్లియర్ గా ప్రస్తావించబడింది. సేమ్.. ఇప్పుడు కరోనా మహమ్మారి ఏ రీతిన విస్తరిస్తుందో? ఏ రీతిన మనలను ఇబ్బందుల పాలు చేస్తుందో? మన శరీరంలోని ఏఏ వ్యవస్థలను ప్రభావితం చేస్తుందో? దాని నుంచి మనలను కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో? ఏఏ చికిత్సలతో ఈ వైరస్ నుంచి మనం స్వస్తి చెందామో?... 5,000 ఏళ్ల నాడు కూడా ఓ వైరస్ నుంచి మనల్ని మనం ఇలానే కాపాడుకున్నాం. నమ్మశక్యంగా లేదా? అయితే ఆయుశక్తి వ్యవస్థాపకురాలు, సీఎండీ స్మితా నరమ్, జివా ఆయుర్వేద డైరెక్టర్ ప్రతాప్ చౌహాన్, చరక్ ఫార్మాకు చెందిన మనీషా మిశ్రాలు వెల్లడిస్తున్న అంశాలను చూడాల్సిందే.

కరోనా విలయ తాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ముగ్గురు కీలక వ్యక్తులు... చరక సంహితలో నాడు మన పూర్వీకులు పేర్కొన్న అంశాలను సవివరంగా ప్రస్తావిస్తున్నారు. 5,000 ఏళ్ల నాడు రాసినట్టుగా భావిస్తున్న చరక సంహితలో కరోనాను పోలిన ఓ వైరస్ గురించి చాలా వివరంగా రాశారు. సదరు పుస్తకంలో 'క్రిమి' అనే అధ్యాయంలో 'శ్లేష్మ క్రిమి'  గురించిన ప్రస్తావన ఉంది. కంటికి కనిపించని ఈ వైరస్ మన శరీరంలోని శ్వాస వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తేనే... శ్లేష్మ క్రిమి సోకిన వ్యక్తి శ్వాస తీసుకోవడం సాధ్యం కాక చివరకు మరణించిన వైనాన్ని ప్రస్తావించింది. అంతేకాకుండా ఇప్పుడు కరోనా సోకితే...మనకు దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలు ఎలా కనిపిస్తాయో?... నాటి శ్లేష్మ క్రిమి సోకితే కూడా సేమ్ ఇవే లక్షణాలతో మంచం పట్టే మనిషి చివరకు ప్రాణాలు విడిచిన వైనాన్ని కూడా సంహితలో సమగ్రంగానే పేర్కొన్నారు.

ఇక ఇప్పుడు కరోనా గుండ్రంగా, నిండా ముల్లులతో కినిపించే రూపంలోనే నాటి శ్లేష్మ క్రిమి కూడా ఉందన్న విషయాన్ని కూడా చరక సంహిత ప్రస్తావించింది. ఇప్పుడు కరోనా నుంచి మనలను మనం కాపాడుకునేందుకు భౌతిక దూరాన్ని ఎలా పాటిస్తున్నామో... నాడు శ్లేష్మ క్రిమి నుంచి కాపాడుకునేందుకు కూడా జనం భౌతిక దూరాన్ని పాటించిన వైనం, భౌతిక దూరంతోనే శ్లేష్మ క్రిమి నుంచి మనలను మనం కాపాడుకునే ఏకైక మార్గమన్న విషయాన్ని కూడా చరక సంహిత ప్రస్తావించిందట. ఇక కరోనా నుంచి మనల్ని కాపాడుకునే క్ర మంలో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ఎలాంటి రసాయనాలతో కూడిన మిశ్రమాలను మనం వాడుతున్నామో.. సేమ్ నాడు శ్లేష్మ క్రిమి నుంచి కాపాడుకునేందుకు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు పలు రకాల పండ్లు, ఆకులతో మిశ్రమాలను తయారుచేసుకున్నట్లుగా కూడా సంహిత చెబుతోంది. మొత్తంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న మన ఆయుర్వేదం... 5,000 ఏళ్ల నాడే కరోనా గురించిన వైరస్ ను, దాని నుంచి తలెత్తే ప్రమాదాన్ని కూడా వివరించిందన్న మాట.
Tags:    

Similar News