కరోనాతో చైనాలో మరణ మృదంగం

Update: 2020-02-16 07:01 GMT
చైనాలో కరోనా వైరస్ (కోవిడ్-19 వైరస్) మరణ మృదంగం వినిపిస్తోంది. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో చైనాలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే చైనాలో 1523 మంది మరణించారు.

 మొత్తం చైనా వ్యాప్తంగా 66వేల మంది మరణించినట్టు నిర్ధారణ అయ్యింది.  ఇందులో 11053మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం.  వీరు మరణిస్తే చైనాలో పెద్ద విషాదం నిండడం ఖాయం..

మరోవైపు చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఏకంగా మరో 8096మందికి సోకింది. వ్యాధికి కేంద్ర బిందువైన హుబే వూహాన్ లో మాత్రమే దీని తీవ్రత బాగా ఉందని చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

కాగా చైనాలోని వుహాన్ నుంచి తీసుకొచ్చిన 406మంది భారతీయులను మానేసర్ - ఢిల్లీలోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కేంద్రాల్లో ఉంచారు. కరోనా సోకలేదని తేలాకే వీరిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.  

కరోనా వైరస్ కరెన్సీ నోట్ల ద్వారా కూడా సంక్రమిస్తోందని తేలడంతో చైనా హుబే ప్రాంతం నుంచి కరెన్సీ నోట్ల చలామణీని తాత్కాలికంగా ఆపేసింది.  కొత్త నోట్లను పంపిస్తోంది.

కరోనా వైరస్ ను అత్యాధునిక వైద్యంతో కాకుండా చైనా సంప్రదాయ వైద్యం, పురాతన ఆయుర్వేదాన్ని ఉపయోగిస్తూ తగ్గిస్తోంది.  సంప్రదాయ వైద్యంతోనే ఈ వ్యాధి తగ్గుతుందని చైనా తెలిపింది.
Tags:    

Similar News