ప్రపంచంలో చాలామంది కుబేరులు ఉన్నారు. కానీ.. పెట్టుబడులు పెట్టే విషయంలో.. ఎప్పుడు ఎంత మొత్తాన్ని.. ఏ వ్యాపారంలో పెట్టాలన్న విషయంలో మాత్రం ఇప్పటికి వారెన్ బఫెటే తోపు. ప్రపంచ కుబేరుల్లో ఆయన స్థానాన్ని ఎవరూ తీయలేనిది. పెట్టుబడులు పెట్టే విషయంలో ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు అంతా ఇంతా కాదు. అలాంటి ఆయనకు సైతం కరోనా కారణంగా జరిగిన నష్టం భారీగా ఉందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. స్టాక్ మార్కెట్లో బఫెట్ కంపెనీ షేరు విలువ భారీగా పడిపోయింది. దీంతో ఆయనకు జరిగిన నష్టం ఎక్కువన్న విషయం అధికారికంగా వెల్లడైంది.
ఈ ఏడాది మార్చితో ముగిసిన తొలి క్యూ1 (త్రైమాసికం) నికర నష్టం అక్షరాల 5వేల కోట్ల డాలర్లుగా తేలింది. మన రూపాయిల్లో ఈ మొత్తాన్ని లెక్క కడితే.. దగ్గర దగ్గర రూ.3.75 లక్షల కోట్లుగా చెప్పాలి. అమెరికాలోని అకౌంటింగ్ రూల్స్ ప్రకారం బెర్క్ షైర్ కు అవాస్తవిక స్టాక్ నష్టాలను.. ఆదాయాలతో లాభాల్ని నివేదించాలి. తొలి నుంచి ఈ రూల్ ను బఫెట్ వ్యతిరేకిస్తూ వచ్చారు.
బఫెట్ సంస్థ పెట్టుబడులు పెట్టే అమెరికన్ ఎక్స్ ప్రెస్.. బ్యాంక్ ఆఫ్ అమెరికా.. వెల్స్ ఫార్గో.. అమెరికన్.. డెల్టా.. సౌత్ వెస్ట్.. యునైటెడ్ తదితర ఎయిర్ లైన్స్ షేర్లలో పెట్టుబడులకు భారీగా గండిపడటంతో.. ఇంత భారీగా నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు. కోవిడ్ పుణ్యమా అని తొంభై కంటే ఎక్కువ వ్యాపారాలు అతి తక్కువ నుంచి తీవ్రమైన ప్రతికూల ప్రభావాల్ని ఎదుర్కొన్నట్లుగా బఫెట్ కంపెనీ పేర్కొంది. అత్యవసరం అని భావించే వ్యాపారాల్లో సైతం ఏప్రిల్ లో వ్యాపారాల ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్లుగా పేర్కొన్నారు. కరోనా ఎవరినీ వదల్లేదనటానికి దీనికి మించిన చక్కటి ఉదాహరణ మరేదీ ఉండదనే చెప్పాలి.