అంతర్జాతీయంగా భయాందోళనలు కలిగిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ 19) హైదరాబాద్‌కు వచ్చింది! కొద్దిరోజుల క్రితం కేరళలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్ - ఢిల్లీలలో ఒక్కో కేసు నమోదయింది. ఇటలీ నుండి ఢిల్లీకి వచ్చిన వ్యక్తితో పాటు - దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన తెలంగాణ వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు కేంద్రం ప్రకటించింది. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.
కరోనాపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం ప్రకటన చేశారు. తెలంగాణలో కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. బెంగళూరు నుండి హైదరాబాద్ వచ్చిన సాఫ్టువేర్ ఉద్యోగికి కరోనా సోకినట్లు తేలిందని - ప్రబలకుండా జాగ్రత్త తీసుకున్నట్లు తెలిపారు. బెంగళూరులో పని చేస్తున్న సదరు ఉద్యోగి కంపెనీ పని నిమిత్తం ఫిబ్రవరి 15న దుబాయ్ వెళ్లారని - తిరిగి బెంగళూరుకు వచ్చి - అక్కడి నుండి హైదరాబాద్ వచ్చారన్నారు.
అతనికి జ్వరం రావడంతో వైద్య పరీక్షలు చేయించుకొని మందులు వాడారని - అయినా తగ్గకపోవడంతో ఆదివారం గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారని - ఆయన రక్తనమూనాలు సేకరించి పుణేకు పంపిస్తే కరోనా ఉన్నట్లు తేలిందన్నారు. దీనిపై కేంద్రానికి సమాచారం అందించినట్లు తెలిపారు. ఆ వ్యక్తి దుబాయ్ వెళ్లి అక్కడ హాంకాంగ్ వారితో కలిశాడని చెప్పారు. ఇక్కడి వాళ్లతో వైరస్ రాలేదని - ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన వారితోనే ఈ ఉపద్రవం అన్నారు.
కరోనా సోకిన వ్యక్తిని గాంధీ ఐసోలేషన్ వార్డులో పాజిటివ్ కేసు వ్యక్తి చికిత్సలో ఉన్నారని - అతను ప్రయాణించిన బస్సులో 27 మంది ప్రయాణించినట్లు తెలిసిందని - వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు. అతను తొలుత సికింద్రాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడని - చికిత్స అందించిన డాక్టర్లతో పాటు యువకుడు వెళ్లిన ప్రాంతాల్లో దాదాపు 80 మందితో అతను కనెక్ట్ అయ్యాడని - వారందరినీ స్క్రీన్ చేస్తామన్నారు. దుబాయ్ నుండి వచ్చాక కంపెనీలో కొద్ది రోజులు ఉద్యోగానికి వెళ్లాడని - కాబట్టి కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేశామన్నారు.
కరోనా వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వారి కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని - ఐజోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. మిలిటరీలో కూడా వంద బెడ్ల ఆసుపత్రి సిద్ధంగా ఉందని చెప్పారు. పాజిటివ్ కేస్ ట్రావెలింగ్ - కనెక్టెడ్ హిస్టరీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.