కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో విచిత్రమైన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా బీహార్ రాష్ట్రంలో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు ప్రత్యక్షం అవుతున్నాయి. పొద్దు పొద్దున్నే ఇళ్ల ముందు ప్రత్యక్షమవుతున్న కరెన్సీ నోట్లు స్థానికుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఆ డబ్బుని తీసుకోకపోతే మిమ్మల్ని నాశనం చేస్తానంటూ హెచ్చరిస్తూ ఓ చీటీ దొరకడం కలకలం రేపుతోంది.
ఇప్పటికే కరోనా వైరస్ భయంతో ఇళ్లల్లో నుండి బయటకి రావాలంటేనే ప్రజలు గజగజ వణికి పోతున్నారు. ఈ క్రమంలో బీహార్‌లోని సహర్స పట్టణంలో కొంతమంది దుండగులు ఇళ్ల ముందు రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను చల్లారు. వీటితోపాటు ఓ చీటి కూడా వదిలి వెళ్లారు. దీనిలో "నేను కరోనాతో వచ్చాను. నన్ను స్వీకరించండి. లేకపోతే మీ అందరినీ వేధిస్తాను" అని రాసి ఉంది.
దీంతో భయాందోళనకు గురైన ప్రజలు పోలీసులకు సమాచారమందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ప్రజలను భయపెట్టేందుకు ఎవరో ఆకతాయి ఇలాంటి పని చేసినట్లు భావిస్తున్నామని, చీటీలోని చేతిరాత ప్రకారం ఈ పనికి పాల్పడుతున్నది ఒక్కరేనని అనుమానిస్తున్నారు. దీనిపై ఓ స్థానికుడు మాట్లాడుతూ.. "పొద్దుపొద్దునే ఇంటిముందు నోట్లు దర్శనమిచ్చాయి. అయితే తొలుత దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇలాంటి ఘటనలు చాలాచోట్ల జరుగుతుండటంతో పోలీసులను ఆశ్రయించా"మని తెలిపాడు.