ఇప్పుడిప్పుడే మ‌హ‌మ్మారి పోదు: తేల్చి చెప్పిన సీఐడీఆర్ఏపీ

Update: 2020-05-04 02:31 GMT
క‌రోనా వైర‌స్‌ పై ప‌రిశోధ‌న‌లు విస్తృతంగా జ‌రుగుతున్నాయి. ఈ ప‌రిశోధ‌న‌ల్లో కొత్త కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.  ఆ మహమ్మారిపై ప్రయోగాలు, అధ్య‌య‌నం చేస్తున్నారు. తాజాగా మిన్నెసొటా యూనివర్సిటీ ఆధీనంలోని సెంటర్‌ ఫర్‌ ఇన్ఫెక్షస్‌ డిసీజ్‌ రిసెర్చ్‌ అండ్‌ పాలసీ (సీఐడీఆర్‌ఏపీ) శాస్త్రవేత్తలు ప‌రిశోధ‌న చేశారు. వారు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ప‌లు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ కరోనా వైరస్ మ‌హ‌మ్మారి ఇప్పుడిప్పుడే వ‌ద‌ల‌ద‌ని, సుదీర్ఘ కాలం యుద్ధం చేయాల్సి వ‌స్తుంద‌ని తెలిపారు. మొత్తం 18 నుంచి 24 నెలల పాటు క‌రోనా వైరస్ నిలిచి ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో మూడింట రెండొంతుల మంది వైరస్‌ను తట్టుకొనే శక్తిని సంతరించుకునేంత వరకు వైరస్‌ను నియంత్రించలేమని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

"ది ఫ్యూచర్ ఆఫ్ ది కొవిడ్-19 పాండమిక్ లైసెన్ లెర్నడ్ ఫ్రమ్ పాండమిక్ ఇన్ ఫ్లూయంజా" పేరుతో ఓ నివేదికకు రూపొందించారు. వైరస్ ప్రవర్తిస్తున్న తీరును, ఇది మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు విశ్లేషించారు. ప‌రిస్థితి ఇలాగ ఉండ‌డంతో 2020 చివరి వరకు కరోనాకు వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదని అంచ‌నా వేశారు. అన్ని దేశాలు, తమ తమ ప్రాంతాలు, ప్రజలను పరిరక్షించుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని త‌మ‌ నివేదిక‌లో సూచించారు. ప్రజలు కూడా రెండేళ్ల వరకు ఎదురయ్యే పరిస్థితులను తట్టుకునేందుకు సిద్ధం కావాలని తెలిపారు. ఇన్ ‌ఫ్లూయెంజాతో పోలిస్తే ఇది భి‌న్నంగా ఉందని దానిని  అదుపులోకి తెచ్చినంత సులువుగా కరోనాను నిలువరించలేమని  హెచ్చరించారు. లాక్‌డౌన్ ముగిశాక మళ్లీ కరోనా వ్యాప్తి తథ్యమని నివేదికలో పేర్కొన్నారు. కరోనా  విపత్తు ముగియలేదని ప్రపంచ దేశాలు గ్రహించాలని ఒకవేళ ఎంతో మంది ఆశలు పెట్టుకున్నట్టుగా, డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రస్తుత డిమాండ్ ను ఏ మాత్రమూ తీర్చలేవని పేర్కొన్నారు.`


Tags:    

Similar News