కరోనా మహమ్మారి దేశంలో కోరలు చాస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రధాని మోడీ నిన్న రాత్రి నుంచి దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. అంటే ఒకరకంగా కర్ఫ్యూ అన్నమాటే. అన్ని మూతపడుతాయి.. అత్యవసర సర్వీసులు - సేవలు తప్ప మిగతా ఏవీ నడువవు. అందరూ ఈ 21 రోజుల పాటు ఇల్లు గడప దాటి అడుగు బయటపెట్టడానికి వీల్లేదు.
*తెలంగాణలో 39కి కేసులు..
కరోనా మహమ్మారిని ఎంత కట్టడి చేద్దామని అనుకుంటున్నా కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రతీరోజు కొత్త కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో 2వ స్టేజీలో భాగంగా కరోనా సోకిన కుటుంబాలకు వ్యాధి వ్యాపిస్తోంది. మంగళవారం నాటికి తెలంగాణలో కొత్తగా మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39కి చేరింది. వీరిలో విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా నిర్ధారణ కాగా.. లోకల్ కాంటాక్ట్ ద్వారా మరో ముగ్గురికి వ్యాధి సోకింది. లండన్ నుంచి వచ్చిన కుమారుడితో సన్నిహితంగా ఉన్న కొత్తగూడెం డీఎస్పీ (57)కు - ఆయన ఇంట్లో పనిచేసే వంటమనిషికి (33) కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది. ఇటీవలే లండన్ నుంచి వచ్చిన కోకాపేట్ కు చెందిన 49 ఏళ్ల వ్యక్తి కి - జర్మనీ నుంచి వచ్చిన చందానగర్ కు చెందిన 39 ఏళ్ల మహిళకు - సౌదీ అరేబియా నుంచి వచ్చిన బేగం పేటకు చెందిన 61 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ తేలింది. వీరందరికీ ఐసోలేషన్ - ఆస్పత్రులకు తరలించారు. ఇక వీరితో సన్నిహితంగా మెగిలిన వారందరినీ ఐసోలేషన్ కు తరలించారు.
*ఏపీలో ఎనిమిదికి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఎనిమిదికి చేరాయి. తిరుపతి పట్టణంలో కరోనా వైరస్ కోసం లండన్ నుంచి తిరిగి వచ్చిన ఒక వ్యక్తికి పాజిటివ్ అని తేలింది. ఇతడు సన్నిహితంగా ఉన్న వారందరినీ గుర్తించి ఐసోలేషన్ కు పంపిస్తున్నారు. అయితే స్తానిక అధికారులు అంతగా సన్నద్ధంగా లేకపోవడంతో విదేశాల నుంచి వచ్చిన వారు.. వారితో సన్నిహితంగా మెలిగిన వారి గుర్తింపు కష్టంగా మారింది. ఏపీలో ప్రస్తుతం కరోనా 2వ స్టేజీలో ఉంది. వైజాగ్ లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఏపీలో బుధవారం తిరుపతిలో కేసుతో సంఖ్య 8కి చేరింది. మొత్తం 15వేల మంది విదేశాల నుంచి తిరిగివచ్చారు. వారిని గుర్తించి పరీక్షించే పనిలో అధికారులున్నారు.మొత్తం రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేసి నిర్బంధం విధించారు. సరిహద్దులు మూసివేశారు.
*తమిళనాడులో తొలి కరోనా మరణం
తమిళనాడు రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించింది. ముధరైలోని రాజాజీ ఆస్పత్రిలో కరోనాతో బాధపడుతున్న 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సి. విజయ్ భాస్కర్ తెలిపారు. బీపీ - షుగర్ వ్యాధులున్న ఇతడికి కరోనా సోకడంతో తట్టుకోలేక మరణించాడు. దీంతో భారత్ లో కరోనా మరణాల సంఖ్య 11కు చేరింది. తమిళనాట మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19. వారంతా చికిత్స పొందుతున్నారు.
*దేశవ్యాప్తంగా 523మందికి కరోనా పాజిటివ్
భారత దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తోంది. బుధవారం నాటికి దేశంలో 523 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తమిళనాడులో వ్యక్తి మృతితో మృతుల సంఖ్య దేశంలో 11కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కర్ణాటకలో ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.