ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళిస్తోంది. రోజురోజుకు విజృంభిస్తోంది. చైనాలోని వూహాన్ లో పుట్టిన ఈ వైరస్ తొలి 67రోజుల్లో కేవలం లక్షమందికి మాత్రమే సోకింది. అదే రెండో లక్ష దాటడానికి 11 రోజులు.. మూడో లక్షకు కేవలం నాలుగురోజుల్లోనే చేరుకుంది. ఇప్పుడు నాలుగో లక్షను కేవలం రెండు రోజుల్లో నమోదు చేసి ప్రపంచానికి పెను సవాల్ విసురుతోంది.
కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించినా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. బుధవారం వరకు కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 18895మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బాధితుల సంఖ్య ఏకంగా 4.22 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 2400మంది వివిధ దేశాల్లో చనిపోయారంటే దీని తీవ్రత ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇటలీలో కరోనా మరణ మృందంగం వినిపిస్తోంది. ఏకంగా మంగళవారం 743మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఇటలీలో మరణాల సంఖ్య 6820కు చేరుకుంది. కొత్తగా మరో 5249 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటలీలో మొత్తం కేసులు 69176 దాటింది.
ఇక వైరస్ పుట్టిన చైనాలో మంగళవారం కరోనా కారణంగా కేవలం నలుగురే చనిపోయారు. 47 కొత్త కేసులు నమోదయ్యాయి. చైనాలో మొత్తం మరణాల సంఖ్య 3821కు చేరింది.
స్పెయిన్ లో 2991 - ఇరాన్ లో 1934 - ఫ్రాన్స్ లో 1100 మంది - అమెరికాలో 778మంది మరణించారు. అమెరికాలో ఏకంగా 54823వేల మందికి కరోనా సోకడం కలకలం రేపింది.
ఇక దక్షిణ కొరియాలో వైరస్ తగ్గుముఖం పట్టింది. అక్కడ 120 మంది చనిపోగా.. 76 కొత్త కేసులు నమోదయ్యాయి. 9037 మంది వైరస్ బారిన పడ్డారు.
చైనాకు - ఇరాన్ కు ఆనుకొని ఉండే పాకిస్తాన్ లో కరోనా విస్తృతంగా వ్యాపిస్తోంది. పాక్ షియా ముస్లింలు ఇరాన్ కు వెళ్లిరావడంతో పాక్ లో వ్యాపిస్తోంది. మరణాల సంఖ్యను పాకిస్తాన్ వెల్లడించలేదు.