ఇరాన్ మరో చైనా కానుందా?

Update: 2020-03-01 04:24 GMT
కొవిడ్ 2019 వైరస్ మహమ్మారి చైనాను ఎంతలా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి తలొగ్గని డ్రాగన్ దేశం.. కంటికి కనిపించనంత సూక్ష్మ వైరస్ ధాటికి వణికిపోవటమే కాదు.. దీని నుంచి ఎప్పటికి కోలుకుంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. చైనా ఆర్థిక పరిస్థితిని దారుణంగా తయారు కావటంలో కొవిడ్ కీలకంగా మారిందని చెప్పక తప్పదు.

ఇప్పటికే వేలాదిమంది ఈ వైరస్ కారణంగా మరణించగా.. మరో బుల్లి దేశం చైనా బాటలో పయనిస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది. ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ వార్తల ప్రకారం ఇరాన్ లో కొవిడ్ వైరస్ విలయతాండవం చేస్తుందని.. ఇప్పటికే ఈ పిశాచి వైరస్ కారణంగా 210 మంది మరణించినట్లుగా వెల్లడించింది. అదే సమయంలో కొవిడ్ పాజిటివ్ కేసులు అరువందల వరకూ చేరినట్లుగా చెబుతోంది.

అయితే.. బీబీసీ వార్తల్ని ఇరాన్ ఖండిస్తోంది. తమ దేశంలో మరణించిన వారి సంఖ్య 43కు చేరినట్లుగా ప్రకటించింది. వందలాది మంది మరణించినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని చెబుతోంది. ఇదిలా ఉండగా ఇవాళ.. రేపటిలో (ఆది.. సోమవారాల్లో) ప్రపంచ ఆరోగ్య సంస్థ టీం ఒకటి ఇరాన్ ను సందర్శించనుంది. చైనాలో మాదిరి ఇరాన్.. దక్షిణ కొరియాలో కొవిడ్ వైరస్ అంతకంతకూ విస్తరిస్తున్న వైనం ఆందోళనకు గురి చేస్తోంది.

ఈ రెండు దేశాల్లో కొవిడ్ వైరస్ నిర్ధారిత కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకూ కొవిడ్ పిశాచి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 2,924కు చేరుకుంది. మరే దేశంలో లేని విధంగా కొవిడ్ వైరస్ లక్షణాలున్న వ్యక్తిని దక్షిణ కొరియా దేశంలో కాల్చివేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇదెంతవరకు నిజమన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దేశంలోకి కొవిడ్ వైరస్ ప్రవేశిస్తే సహించేది లేదని అధికారులకు సౌత్ కొరియా అధినేత తీవ్రమైన వార్నింగ్ ను అధికారులకు జారీ చేయటం గమనార్హం.
Tags:    

Similar News