5జీ టెక్నాలజీతో కరోనా.. నిజమేంటి?

Update: 2020-04-23 15:30 GMT
దేశంలో 4జీ టెక్నాలజీ రావడంతోనే సెల్ ఫోన్లలో డేటా స్పీడ్ జోరందుకుంది. చిటికెలో వీడియోలు చూస్తున్నాం.. అప్ లోడ్ చేస్తున్నాం.. టిక్ టాక్ సహా యూట్యూబ్ లలో వీడియోలు ఎంజాయ్ చేస్తున్నాం. అదంతా 4జీ తెచ్చిన మహిమ. మరి దానికి తలదన్నే 5జీ బ్రాండ్ టెక్నాలజీలోనే ఓ విప్లవం లాంటింది. ఇప్పటికే బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వచ్చేసింది. అక్కడే 5జీ వల్ల చిటికెలో సెకన్లలో డౌన్ లౌడ్ అయ్యే డేటా స్పీడ్ ఉంటుంది.

అయితే తాజాగా కరోనా వైరస్ 5జీ వల్ల మరింతగా వ్యాపిస్తుందని.. ఆ డేటా తరంగాల వల్ల కరోనా బాగా పెరుగుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ పోస్టులు వైరల్ కావడంతో బ్రిటన్ లో జనాలు నమ్మి చాలా సెల్ ఫోన్ టవర్లను ధ్వంసం చేశారు.

 దీంతో ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి సమాచార ప్రసార సాంకేతిక విభాగం తాజాగా స్పందించింది. కరోనా వైరస్ వ్యాప్తికి, 5జీ సాంకేతిక పరిజ్ఞానానికి ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. సాంకేతికంగా దీనికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.

ఇక అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ సంఘం అధికార ప్రతినిధి మోనికా గెహ్నార్ సైతం.. కరోనా వైరస్ రేడియో తరంగాల ద్వారా వ్యాపించదని.. ఈ ప్రచారం నిజంగా దారుణమని తెలిపింది.

  


Tags:    

Similar News