కూటమిలో షిండే ఏకాకి...బీజేపీతో అజిత్ పవార్

ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కూడా బీజేపీకి సీఎం పదవి విషయంలో జై కొట్టింది.

Update: 2024-11-26 03:55 GMT

మహారాష్ట్ర కొత్త సీఎం పదవి బీజేపీకే దక్కౌంది. ఇది నూటికి రెండు వందల శాతం కరెక్ట్. ఎందుకు అంటే మొత్తం 145 మంది సభ్యులు ఉంటే అధికారం దక్కుతుంది. ఇది మ్యాజిక్ ఫిగర్. అయితే బీజేపీకి ఆల్ రెడీ 132 మంది మెంబర్స్ ఉన్నారు. మరో పది మంది కూటమి నుంచే గెలిచిన వారు ఉన్నారు. వీరంతా మద్దతు ఇస్తే ఆ నంబర్ కాస్తా 142కి చేరుకుంటోంది.

ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కూడా బీజేపీకి సీఎం పదవి విషయంలో జై కొట్టింది. ఈ మేరకు పూర్తి మద్దతు ఇస్తోందని తెలుస్తొంది. దాంతో బీజేపీకి అతి సునాయాసంగానే సీఎం పదవి దక్కబోతోంది.

అయితే 57 సీట్ల బలంతో ఉన్న ఏక్ నాధ్ షిండే శివసేనకు మాత్రం నిరాశ తప్పడంలేదు. బీహార్ లో 2020 ఎన్నికల్లో ఎక్కువ సీట్లు బీజేపీ సాధించినా తనకంటే తక్కువ వచ్చిన జేడీయూ నేత నితీష్ కుమార్ ని సీఎం గా చేసింది కదా అదే ఫార్ములా మహారాష్ట్రలో అమలు చేయమని షిండే వర్గం ఎమ్మెల్యేలు అంటున్నారు.

అయితే బీహార్ సీన్ వేరు. అక్కడ నితీష్ కుమార్ కి సీఎం ఇవ్వకపోతే ఆయనకు కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి నుంచి ఆఫర్ ఉంది. పైగా బీజేపీకి మద్దతు ఇచ్చే వేరే పార్టీ లేదు అందుకే అక్కడ అలా చేశారు. కానీ మహారాష్ట్రలో బీజేపీకి దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా సీట్లు దక్కాయి. పైగా అజిత్ పవార్ మద్దతు ఉంది. దాంతో ఏక్ నాధ్ షిండే మళ్లీ సీఎం అయ్యే చాన్స్ లేదని అంటున్నారు.

ఆయనకు ఇస్తే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఇక బీజేపీ నాయకత్వంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో అజిత్ పవార్ దే కీలక పాత్ర కాబోతోంది అని అంటున్నారు. షిండే సీఎం సీటు కోసం తన వర్గంతో చర్చలు జరిపి డిమాండ్ చేయిస్తే అదే సమయంలో అజిత్ పవార్ పావులు కదిపి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని మరీ తన ప్రాధాన్యాన్ని పెంచుకున్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో షిండే ఏక్ నాధుడే అయ్యారని అంటున్నారు. ఆయన వర్గం కచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే అని అంటున్నారు. లేకపోతే విపక్షంలో ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ అలా అనుకున్నా ఒకసారి గద్దెనెక్కిన బీజేపీ కూటమి షిండే వర్గాన్ని అలా ఉండనిస్తుందా అన్నదే చర్చ. మొత్తానికి 2022లో అనూహ్యంగా సీఎం అయిన షిండే ఇపుడు అన్నీ ఊహించి అతికి పోయి కూటమిలో ప్రాధాన్యత తగ్గించుకుంటున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News