లాక్ డౌన్ వేళ మెడికల్ దుకాణాలతో పాటు కిరాణా దుకాణాలు కొనసాగుతున్నాయి. ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం వాటికి మినహాయించారు. దీంతో దేశంలో అన్నిచోట్ల కిరాణ దుకాణాలు తెరచి ఉన్నాయి. ప్రతి గల్లీలో.. వీధుల్లో - కాలనీల్లో చిన్నచిన్న కిరాణా దుకాణాలతో పెద్ద పెద్దవి తెరచుకున్నాయి. అయితే ఆ కిరాణ దుకాణాలే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తెలుస్తోంది. ఈ విషయం తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ బాధితులకు కిరాణ దుకాణం ద్వారా వ్యాప్తి చెందిందని గుర్తించారు. ఈ విషయాన్ని రుజువు చేసేలా హైదరాబాద్ లోని బేగంబజార్ - మలక్ పేట గంజ్ హోల్ సేల్ మార్కెట్ తో పాటు సూర్యాపేట మార్కెట్ లో కూడా పెద్ద ఎత్తున కేసులు నమోదైన విషయం తెలిసిందే. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదు కావడానికి మార్కెటే కారణమైందని అందరికీ తెలిసిందే.
ఆయా మార్కెట్‌లో వ్యాపారుల నుంచి చిరు వ్యాపారులకు వైరస్ విస్తరిస్తుంది. వారి ద్వారా వారి కుటుంబసభ్యులకు - కాలనీల్లోని కొనుగోలుదారులకు వైరస్ సోకుతోంది. ఆ మార్కెట్ నుంచి శివారు ప్రాంతాల్లోని బస్తీలు - కాలనీల్లోని చిన్న చిన్న కిరాణా దుకాణం నిర్వాహకులకు సామగ్రి వెళ్తోంది. హోల్ సేల్ దుకాణాల నుంచి వస్తువులు తెచ్చిన తర్వాత వాటిపై శానిటైజ్ స్ప్రేలు చల్లకపోవడంతో వైరస్ వారికి వ్యాపిస్తోంది. మార్కెట్ ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తోంది. భౌతిక దూరం - మాస్క్ లు ధరించడం - శానిటైజర్ వాడకం వంటివి చేయడం లేదు. దీంతో వైరస్ మార్కెట్ లను కేంద్రాలుగా చేసుకుని విస్తరిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతున్నట్లు వైద్యులు - అధికారులు చెబుతున్నారు.
జల్ పల్లి - పహడీషరీఫ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులతో మలక్ పేట గంజ్ లోని ముగ్గురు వ్యాపారులకు కరోనా సోకింది. ప్రస్తుతం తెలంగాణలో పెరుగుతున్న కేసులకు ఇది లింక్ ఉందని తెలుస్తోంది. ఇటీవల నమోదవుతున్న కేసుల్లో చాలా వరకు మలక్ పేట్ గంజ్ మూలాలే ఉంటున్నాయి. మార్కెట్ లో పల్లీనూనె వ్యాపారం చేసే సరూర్ నగర్ కు చెందిన వ్యక్తి నుంచి వనస్థలిపురం ఏ–క్వార్టర్స్ లో ఉండే ఆయన తండ్రి - తల్లి - సోదరుడు - సోదరుడి భార్య - ఇద్దరు కుమార్తెలు - సోదరుడి బావ - ఆయన ఇద్దరు పిల్లలకు ఇలా వారి కుటుంబంలోని తొమ్మిది మందికి కరోనా సోకింది. వారిలో పల్లీ నూనె వ్యాపారి తండ్రి - ఆయన సోదరుడు మృతిచెందడం కలవరం రేపుతోంది. ప్రస్తుతం ఆయన తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉంది.
ఇక వారితోపాటు అక్కడ పని చేస్తున్న ఓ హమాలి కార్మికుడు రెండు రోజుల క్రితం మృతి చెందగా - మరో పండ్ల వ్యాపారికి కూడా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. మార్కెట్ కేంద్రంగా ఎక్కువ కేసులు నమోదు కావడంతో శనివారం ఆ మార్కెట్‌ను రెడ్ జోన్ గా ప్రకటించారు. అష్టదిగ్బంధం చేశారు. మార్కెట్ వలన కరోనా సోకడంతో 45 రోజుల్లో మార్కెట్ కు వచ్చిన వారితో పాటు వ్యాపారులు - హమాలీలు - ఇతర వర్కర్లను గుర్తించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.