బ్రేకింగ్: తిరుపతిలో కరోనా వైరస్.? కేంద్రం కీలక నిర్ణయం

Update: 2020-03-01 11:21 GMT
ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంటు వ్యాధి.. భారీ జనసమూహాలు తిరిగే తిరుమల-తిరుపతిలో ప్రవేశిస్తే ఏమైనా ఉంటుందా.. లక్షల మంది దర్శించుకునే తిరుమలలో ఈ వ్యాధి ప్రబలితే ఊహించడానికే వీలులేని అపార నష్టం వాటిల్లుతుంది. అయితే ఆ భయం ప్రస్తుతం తిరుపతిలో చోటుచేసుకుంది.

తాజాగా తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో కరోనా వైరస్ లక్షణాలతో ఓ రోగి చికిత్స చేయించుకునేందుకు చేరడం కలకలం రేపింది. ఈ రోగి చైనాకు చెందిన వాడే కావడం మరింత కలవర పెడుతోంది.

చైనాకు చెందిన ఒక టెక్నీషియన్ స్థానిక బంగారు పాళ్యెం దగ్గరున్న ఒక ప్రైవేటు ఫ్యాక్టరీలో మరమ్మతులు చేసేందుకు భారత్ కు వచ్చాడు. రెండు రోజులుగా  తీవ్ర జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడు. రుయా ఆస్పత్రిలో చేరగా రక్తనమూనాలను వైద్యులు సేకరించి ల్యాబ్ కు పంపారు. రెండు రోజుల్లో అతడికి కరోనా వైరస్ ఉందా లేదా అన్నది తేలనుంది.

ఈ క్రమంలోనే భారత్ అప్రమత్తమైంది. చైనా సహా ఇరాన్, దక్షిణ కొరియా, పాకిస్తాన్ నుంచి ఎవరూ రాకుండా నిషేధం విధించింది. ప్రస్తుతం చైనా నుంచి వచ్చిన ఈ రోగిని ప్రత్యేకంగా ఉంచి చికిత్స చేస్తున్నారు. కేంద్రం అలెర్ట్ ప్రకటించి విదేశీయులను భారత్ కు రాకుండా నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News