విజయవాడలో కరోనా వైరస్‌ కలకలం ...

Update: 2020-03-04 12:50 GMT
కరోనా వైరస్ ..ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపిస్తున్న ఏకైక పేరు. ఎక్కడో చైనాలో పుట్టిన ఈ మహమ్మారి..కొద్దికొద్దిగా విస్తరిస్తూ, ప్రపంచం మొత్తం వ్యాప్తిచెందింది. ప్రస్తుత ఈ కరోనా తెలురాష్ట్రాలపై పంజా విసురుతోంది. తాజాగా విజయవాడలో కరోనా అనుమానిత కేసు నమోదు అయ్యింది. బెజవాడ కు చెందిన ఓ యువకుడికి కరోనా వైరస్‌  సోకినట్లు అనుమానాలు రావడంతో ఆ యువకుడుని నగరంలోని కొత్త ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీజీహెచ్‌ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

బాధితుడు ఇటీవల జర్మనీ నుంచి విజయవాడకు వచ్చినట్లు తెలుస్తోంది. తీవ్రమైన జ్వరం, జలుబు ఉండడంతో యువకుడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కరోనా నిర్ధారణ కోసం శాంపిల్స్‌ని తిరుపతికి పంపించే ఆలోచన చేస్తున్నారు.  దేశంలో ఇప్పటివరకు  28 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ అధికారిక ప్రకటన చేశారు. 12మంది భారతీయులు, 16మంది విదేశీయులకు కరోనా సోకిందన్నారు.

భారత పర్యటనకు వచ్చిన 16 మంది ఇటలీ దేశీయులకు కరోనా సోకినట్టు తెలిపారు. 14మంది పర్యాటకులను తీసుకెళ్లిన డ్రైవర్‌ కు కూడా కరోనా సోకిందని చెప్పారు. ఢిల్లీలో 14మందికి - జైపూర్‌ లో ఇద్దరికి చికిత్స అందిస్తున్నట్టు ప్రకటించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 80కు పైగా దేశాల్లో 93వేల కేసులు నమోదయ్యాయి. దాదాపు 3500 పైచిలుకు మంది మృతి చెందారు. 
Tags:    

Similar News