దేశ ప్రధాని మోడీ కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే అంతకుమించి కనిపిస్తే కాల్చివేత వరకు వెళతానన్నాడు. అయితే జనాలు మాత్రం ఉదయం కూరగాయలు, నిత్యావసరాలకు వచ్చి సామాజిక దూరం పాటించడం లేదని.. వినకుండా రోడ్లపైకి రావడం.. పోలీసులు లాఠీలకు పనిచెప్పడం.. కరోనాకు ఎవరూ భయపడడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. కూరగాయలను హోం డెలివరీకి వాడలు వెళ్లి పంపిణీ చేసే చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్టు తెలిసింది.
అందుకే తెలంగాణలో లాక్ డౌన్ ను వచ్చే 21 రోజుల పాటు మరింత కఠినంగా అమలు చేయాల్సి ఉందని సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. గురువారం మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ అమలవుతున్న తీరు పై కేసీఆర్ సమీక్షించారు. పాటుపడుతున్న పోలీస్, వైద్యశాఖ, శానిటరీ ఉద్యోగులను అభినందించారు.
ప్రస్తుతానికి విజయవంతంగా లాక్ డౌన్ అమలవుతోందని.. దీన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సామాజిక దూరం పాటించేలా ప్రజలను కోరారు. ఈ మేరకు కొన్ని సూచనలు చేశారు.
ఈ సందర్భంగా విదేశాల నుంచి వచ్చిన వారు.. వారి కుటుంబ సభ్యుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ, కలెక్టర్లను కేసీఆర్ ఆదేశించారు.
ఇక తెలంగాణలో రాత్రిపూట పూర్తి కర్ఫ్యూ పట్ల కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారని తెలిసింది. ఎవరికి అనుమానం, లక్షణాలు కలిగినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు.