వెనకటికొకడు...ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే...చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగాంట...ఇపుడు ప్రపంచమంతా కరోనా వైరస్ బారినుండి ఎలా బయటపడాలని చూస్తుంటే....కరోనా వైరస్ నూ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు కొందరు సోషల్ మీడియా మేధావులు. కరోనాపై నకిలీ వార్తలు క్రియేట్ చేస్తూ....తమ యూట్యూబ్ చానెల్స్ ద్వారా కొందరు డబ్బులు సంపాదిస్తున్నారట. ఈ నకిలీ వార్తల ప్రవాహంలో పడి కరోనాకు సంబంధించిన అసలు సమాచారం మరుగున పడుతోందట. ఈ నేపథ్యంలో నకిలీ వార్తలు క్రియేట్ చేసేవారి ఆటకట్టించడానికి యూట్యూబ్ యాజమాన్యం రంగంలోకి దిగింది. ఈ మహమ్మారి వైరస్ గురించి మాట్లాడే వీడియోలను డీమానిటైజ్ చేస్తున్నామని యూట్యూబ్ ప్రకటించింది.
నిజం నాలుగూళ్లు తిరిగే సరికి అబద్ధం అరవై ఊళ్లు ప్రయాణిస్తుందట. యూట్యూబ్ లో కూడా నకిలీ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనితో పాటు కరోనాకు సంబంధించిన విలువైన సమాచారం కూడా ఉంది. అయితే, నకిలీలకు చెక్ చెప్పేందుకు ప్రభుత్వాలు తీసుకుంటోన్న చర్యలతో పాటు....యూట్యూబ్ కూడా కొన్ని ఆంక్షలు విధించింది. కరోనా వైరస్ గురించి చర్చించే యూట్యూబ్ వీడియోలను డీమానిటైజ్ చేస్తామని యూట్యూబ్ ప్రాడక్ట్ మేనేజిమెంట్ డైరెక్టర్ టామ్ లూయెంగ్ క్రియేటర్ ఇన్ సైడ్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రకటించారు. గతంలోనూ కరోనా తరహా సున్నితమైన అంశాల గురించి చర్చించే వీడియోలను డీమానిటైజ్ చేశారు. కరోనా వైరస్, హెల్త్ ఇష్యూ, పొడి అక్షరాలు వాడిన వారి వీడియోలు డీమానిటైజ్ అవుతాయట.
కరోనా ప్రభావంతో టెక్ కంపెనీలు కూడా ఆదాయాన్ని కోల్పోయాయి. ఈసారి తను ఆదాయ లక్ష్యాలను చేరుకోలేకపోవచ్చని తమ పెట్టుబడిదారులను ఆపిల్ హెచ్చరించింది. తమ ఉద్యోగుల ప్రయాణ పరిమితులను ఆ సంస్థలు కఠినతరం చేశాయి. సెలబ్రిటీలు - సినీ తారలపై కూడా ఈ కరోనా ప్రభావం పడింది. దీపిక ప్యారిస్ ఫ్యాషన్ వీక్ క్యాన్సిల్ చేసుకుంది. శాన్‌ఫ్రాన్సిస్కో లో జరగబోతున్న గేమ్ డెవెలపర్స్ ప్రోగ్రామ్‌కు వెళ్లడంలేదని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. తమ ఎఫ్-8 – యాన్యువల్ డెవెలపర్ సమావేశాన్ని ఫేస్‌బుక్ రద్దు చేసింది. మొత్తానికి కరోనా దాదాపు అన్నిరంగాలపై తన ప్రభావాన్ని చూపుతోందని చెప్పవచ్చు.