ఏపీ అధికారపక్షంపై అవినీతి ఆరోపణలు ఈ మధ్యన తరచూ వస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ అధికారపక్షంలో అవినీతి అంతకంతకూ పెరిగిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం బాబు సర్కారులో చోటు చేసుకుంటున్న అవినీతిపై పదే పదే విమర్శలు చేయటాన్ని మర్చిపోలేం. గడిచిన మూడేళ్ల వ్యవధిలో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ విపక్షానికి చెందిన మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీటిని ఏపీ అధికారపక్షం తరచూ ఖండించేది కూడా.
ఇదిలా ఉంటే.. తాజాగా ఆంగ్ల మీడియా సంస్థ (దక్కన్ క్రానికల్) ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇందులో టీడీపీ ఎమ్మెల్యే అవినీతిపై ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. గుంటూరుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఒకరు రోజూ రూ.3కోట్ల చొప్పున అవినీతికి పాల్పడుతున్నట్లుగా పేర్కొంది. ఇంత భారీ సంపాదన ఏ విధంగా సాధ్యమవుతుందన్న విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇసుక మైనింగ్ తో ఈ భారీ ఆదాయాన్ని సదరు ఎమ్మెల్యే సమకూర్చుకున్నట్లుగా వెల్లడించింది. అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా పేర్కొంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గడిచిన మూడేళ్లలో ఏపీకి చెందిన పలు విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పలువురు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడటం.. ఈ సందర్భంగా వారు భారీ ఎత్తున ఆస్తుల్ని గుర్తించటం తెలిసిందే.
పోలీస్.. ఎక్సైజ్.. రెవెన్యూ.. విద్యాశాఖకు చెందిన అధికారులు పలువురు గడిచిన మూడేళ్లలో ఏసీబీ అధికారుల తనిఖీల్లో దొరికిపోవటం గమనార్హం. ఏపీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే పలు శాఖల అధికారులపై అవినీతి ఆరోపణలు రావటం గమనార్హంగా చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/