అవకాశాల స్వర్గదామం అనే పేరున్న అమెరికా గురించి ఆవేదన భరితంగా వీడియో పోస్ట్ చేసిన ఓ అమ్మాయికి అనూహ్యమైన ఝలక్ తగిలింది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా వెళ్లి విద్యాభ్యాసం చేసి అనంతరం మంచి ఉద్యోగాలు పొందాలనుకునే వారికి పరిస్థితి ఆశాజనకంగా ఏమీ లేదని, ఇక్కడ అంతా కష్టాలు పడుతున్నారని ఓ అమ్మాయి పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అమెరికా అంటే భూతల స్వర్గం ఏమీ కాదని...ఎన్నో కష్టాలు ఉంటాయని ఆమె వాపోయింది. ఈ వీడియోకు కౌంటర్ గా ఓ అబ్బాయి మరో వీడియో పెట్టాడు. ఆ వీడియో సైతం హల్ చల్ చేస్తోంది.
అమెరికా అంటే హైదరాబాద్ లోని అమీర్ పేట్ కాదని ఈ అబ్బాయి ఘాటు కౌంటర్ ఇచ్చారు. అమెరికాలో చదువు అనేది మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరికీ ప్లాన్స్ ఉంటాయని ఈ వీడియోలో విద్యార్థి వివరిస్తూ...20 లక్షలు ఖర్చు పెట్టి వీసా తెచ్చుకుని ఇంటర్వ్యూకెళ్లి అక్కడ క్వాలిఫై అయితేనే అమెరికా వచ్చారని స్పష్టంచేశారు. ఇండియాలో దోమలున్నట్టే అమెరికాలో బగ్స్ ఉంటాయని వ్యాఖ్యానించారు. అత్యున్నత చదువులు పూర్తి చేసుకున్న వారు తగు విధంగా కొలువులు పొందుతుంటే అలాంటి కెపాసిటీ లేని వారు సర్దుకుపోతున్నారని తెలిపారు. అలా చేసేదాన్ని పాచి పని అంటూ తేలిగ్గా తీసుకోవద్దని ఒకింత ఘాటుగా సూచించారు. ఎవరైనా పార్ట్ టైమ్ ఉద్యోగం చేసి కింది స్థాయి నుంచి పైస్థాయికి వెళ్లాల్సిందేనని తేల్చిచెప్పారు. ఔత్సాహికులు అందరూ అమెరికాకు రావాలని, ఇక్కడ లైఫ్ చూడాలని సదరు విద్యార్థి ఆకాంక్షించారు. ఇదిలాఉండగా మరో మహిళా విద్యార్థి సైతం ఈ వీడియోపై ఘాటుగా స్పందించారు. టైం పాస్ కోసం ఇలాంటి వీడియోలు పెట్టవద్దని కోరుతూ ఈ తరహా పనుల వల్ల విద్యార్థుల్లోనే కాకుండా వారి కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన నెలకొంటుందని తెలిపారు.
మొత్తంగా అమెరికా ఎంతో ఉత్సాహం ప్రదర్శించే వారిని అవనసరంగా కంగారు పెట్టేలా వ్యాఖ్యలు చేయవద్దనేది ఈ రెండు వీడియోల సారాంశం. ఆ అమ్మాయి వీడియోలో చెప్పినట్లుగా అధ్వాన పరిస్థితులు ఏమీ లేవనేది వారి అభిప్రాయం.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/