సోషల్ మీడియాలో చెలరేగిపోతూ.. మెసేజింగ్ విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి.. స్మార్ట్ ఫోన్ ఉన్న వారిలో అత్యధికులు వినియోగించే వాట్సప్ మీద బ్రెజిల్ లో నిషేధం వేటు పడింది. ఆ దేశానికి చెందిన ఒక న్యాయస్థానం వాట్సప్ మీద 48 గంటల నిషేధాన్ని విధించటం ఇప్పుడు సంచలనంగా మారింది. నేర విచారణకు సహకరించే విషయంలోనూ.. మత్తు పదార్థాల అక్రమ రవాణాకు సంబంధించిన మేసేజ్ లకు కారణం అవుతుందన్న మాటతో ఏకీభవించిన న్యాయస్థానం వాట్సప్ మీద 48 గంటల నిషేధాన్ని విధించారు.
దీంతో.. బ్రెజిల్ లోనిదాదాపు 9.3కోట్ల మంది వినియోగదారులకు సంబంధించి వాట్సప్ సేవలు రెండు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. బ్రెజిల్ కోర్టు తీర్పుపై వాట్సప్ యాజమాన్య సంస్థ అయిన ఫేస్ బుక్ తీవ్ర దిగ్భాంత్రిని వ్యక్తం చేసింది. ఫేస్ బుక్ సీఈవో అయితే.. బ్రెజియన్లకు ఇది చాలా విచారకర దినంగా వ్యాఖ్యానించారు. వాట్సప్ పై విధించిన నిషేధం ముగిసే వరకూ.. ఫేస్ బుక్ మెసేంజర్ ను వాడుకోవాలని సూచించారు.జుకర్ బర్గ్ వ్యవహారం చూస్తే.. సంస్థకు షాకింగ్ లాంటి వార్త వెలువడిన సమయంలోనూ ఆయనలోని వ్యాపారి యాక్టివ్ గా ఉండటం.. వాట్సప్ సేవలు నిలిచిపోయే ఈ సమయాన్ని.. ఫేస్ బుక్ మెసేంజర్ ను ప్రమోట్ చేసుకోవటం చూస్తే.. జుకరా మజాకానా అనిపించక మానదు.