కోర్టులో షారుఖ్ కొడుకుకు గట్టి షాక్.. బెయిల్ నిరాకరణ

Update: 2021-10-08 13:30 GMT
ముంబైలోని క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీ చేసుకొని దొరికిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరింత చిక్కుల్లో పడ్డాడు.  క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ చేసుకుంటూ డ్రగ్స్ తీసుకొని దొరికిన షారుఖ్ ఖాన్ కుమారుడు అడ్డంగా దొరికిపోయాడు.  నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అరెస్టు చేసిన ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను ముంబై కోర్టు తాజాగా తిరస్కరించింది. ఇదే స్టింగ్ ఆపరేషన్‌లో నిర్బంధించిన అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచా బెయిల్ దరఖాస్తులను కూడా కోర్టు తిరస్కరించి గట్టి షాక్ ఇచ్చింది.

దీని అర్థం ఆర్యన్ ఖాన్ జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతాడని అర్థమవుతోంది.  ఎన్‌సీబీ కస్టడీ ముగిసిన అనంతరం గురువారం మేజిస్ట్రేట్ కోర్టు ఆర్యన్, ఇతరులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

ముంబై ఎస్ప్లానేడ్ కోర్టు బెయిల్‌ను తిరస్కరించడంతో షారూఖ్ ఖాన్ తరఫు న్యాయవాదులు సెషన్స్ కోర్టుకు వెళ్లాలని ఆలోచనలో ఉన్నారని సూమాచారం. అత్యవసరం అయితే బొంబాయి హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో జరిపిన దాడిలో ఎన్‌సిబి ఆర్యన్‌తో పాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేసింది. ఆర్యన్ తోపాటు మొత్తం 8మందిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ తాజాగా విచారణ అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆర్యన్ ఖాన్ సహా 8మంది నిందితులను 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి పంపింది. ఎవరినీ అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం లేదని.. విచారణకు ఎన్సీబీకి తగినంత సమయం .. అవకాశం ఇచ్చామని కోర్టు తెలిపింది. దీంతో ఆర్యన్ ఖాన్ సహా ఇతరుడు జ్యూడీషియల్ కస్టడీకి పంపించారు.

ప్రముఖ న్యాయవాది సతీష్ మన్ షిండే ఆర్యన్ కేసు టేకప్ చేశారు. ఆర్యన్ ఖాన్ జ్యూడీషియల్ కస్టడీకి పంపించిన వెంటనే కోర్టులో రెండు బెయిల్ పిటీషన్లు వేశాడు. తక్షణ బెయిల్ పొందడానికి ఒక మధ్యంతర బెయిల్ అలాగే..రెగ్యులర్ బెయిల్ కూడా దరఖాస్తు చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తు జరిగే వరకూ ఆర్యన్ ఖాన్ బెయిల్ పై ఉంటారు. బెయిల్ పిటీషన్ శుక్రవారం ఉదయం విచారణకు వచ్చింది. తాజాగా మరోసారి బెయిల్ పిటీషన్ తిరస్కరణకు గురికావడంతో షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ ఆందోళనలో మునిగిపోయింది. ముంబై హైకోర్టుకు వెళ్లేందుకు రెడీ అయ్యింది.
Tags:    

Similar News