తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తక్షణమే రిలీవ్ కావాలని కోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. రాజ్యంగ నిబంధనలకు విరుద్ధంగా సీఎం కేసీఆర్ సోమేశ్ కుమార్ ను నియమించారని సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 13 మంది తెలంగాణకు చెందిన సీనియర్లకు అవకాశం ఉన్నా.. వీరందరిని కాదని సోమేవ్ కుమార్ కు ఆ పోస్టు ఇవ్వడంపై ఎప్పటి నుంచే అసంతృప్తి నెలకొంది. సీఎం కేసీఆర్ తనకు అనుకూల నిర్ణయాలు ఇవ్వాలనే దురుద్దేశంతోనే సోమేశ్ ను నియమించారని అంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏపీకి చెందిన వ్యక్తినిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎలా నియమిస్తారని అన్ని వర్గాల వైపు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కు ఇదో అస్త్రంగా మారింది. సోమేశ్ కుమార్ రిలీవ్ కావాలని కోర్టు తీర్పు వెలువడిన వెంటనే బండిసంజయ్, రేవంత్ రెడ్డిలు స్పందించారు.
తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు ఇక్కడివారికే దక్కాలని ప్రజల్లో చైతన్యాన్ని నింపిన కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రధాన పోస్టుల్లో ఆంధ్రాకు చెందిన అధికారులను నియమించారని ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. అయితే నిబంధనలకు అనుగుణంగానే అధికారులను నియమించారని అధికార పార్టీకి చెందిన నాయకులు చెబుతూ వస్తున్నారు. కానీ ఉన్నత పదవిలో ఉన్న అధికారినే ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తిని నియమించడంపై రాజకీయాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు అవుతున్నా.. ఇప్పటి రకు పోలీస్ జాబ్స్ తప్ప ఇతర నోటిఫికేషన్లు లేవు. ఉన్నవారికి వయసు పరిమితి పెంచారు. దీంతో యువతతో కేసీఆర్ పై అసహనం పెరిగింది.
రైతులు, వృద్ధులు, కుల సంఘాలను ప్రోత్సహించిన కేసీఆర్ విద్యావంతులను మాత్రం పట్టించుకోలేదు. బీజేపీ ఈ విషయాన్ని గ్రహించి ఉద్యోగాల విషయంలో పోరాడడంతో చాలా మంది బీజేపీ వైపు మళ్లుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల్లోనై సరైన సమయానికి జీతాలు రాకపోవడంతో అసహనంతో ఉన్నారు. రైతుబంధు, దళితబంధు లాంటి పథకాలకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం ఉద్యోగాలకు మాత్రం టైంకు జీతాలు ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తమైంది. ఇక సీపీఎస్ విధానంపై ఎప్పటి నుంచో ఆందోళన జరగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇతర ప్రాంత వ్యక్తి అని కోర్టు తేల్చడంపై తెలంగాణ వాదుల్లో మరోసారి పోరాట జ్వాలను రేపిటనట్లయింది.
ఈ తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు దీనిని అవకాశంగా తీసుకోవాలని చూస్తున్నారు. ఇదే అంశంపై ప్రజలను తమ వైపుకు తిప్పుకోనున్నారు. కేసీఆర్ పై ఎప్పటి నుంచో తీవ్ర ఆరోపణలు చేస్తున్నా.. వారిపై గులాబీనేత తనదైన వ్యాఖ్యలతో తిప్పికొడుతున్నారు. కానీ ఇప్పుడు సోమేశ్ విషయంలటలో కేసీఆర్ కు చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల బండి సంజయ్, రేవంత్ లు దీనినే అస్త్రంగా చేసుకొని వచ్చే ఎన్నికల్లోకి వెళ్లనున్నారు.
సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నీ తప్పుడు నిర్ణయాలనే విషయం ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ధరణి యాప్ ను ప్రవేశపెట్టి భూముల సమస్యలు తెచ్చారని అంటున్నారు. చాలా మంది సొంత భూములున్న అవి తమ పేరున లేకపోవడంపై రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ పేరు మార్పు కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కష్టాలు పడుతున్నారు. దీంతో సోమేశ్ కుమార్ స్థానంలో ఇతరులు వస్తే ప్రజలకు న్యాయం అవుతుందనే ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే కొంత మంది పేర్లను పరిశీలిస్తున్నారు. వీరిలో అరవింద్ కుమార్, శాంతాకుమారి, రామకృష్ణ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.