బాలిక‌పై అత్యాచారం.. 7 గంట‌ల్లో తీర్పు!

Update: 2018-08-22 05:55 GMT
ఒక కేసు కోర్టు ముందుకు వెళ్లిన త‌ర్వాత తీర్పులు ఎప్పుడు వ‌స్తాయో ఎవ‌రూ చెప్ప‌లేనిది. నెల‌లు కాదు కానీ సంవ‌త్స‌రాలు ఖాయం. అలాంటి వేళ‌.. వ‌డివ‌డిగా తీర్పులు ఇస్తున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్ కోర్టుల తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.

తాజాగా ఒక మైన‌ర్ బాలిక‌ను బాలుడు రేప్ చేసిన ఉదంతంలో అత‌డికి శిక్ష విధించే అంశాన్ని కేవ‌లం 7 గంట‌ల్లోనే పూర్తి చేసిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మైన‌ర్ బాలిక‌పై 14 ఏళ్ల బాలుడు రేప్ చేసిన ఉదంతాన్ని ఉజ్జ‌యినికి చెందిన కోర్టు ఒక‌టి.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే విచార‌ణ‌ను పూర్తి చేసి.. స‌ద‌రు బాలుడ్ని బాల‌నేర‌స్తుల గృహంలో రెండేళ్లు ఉంచాల‌ని తీర్పును ఇచ్చారు.

లైంగిక వేధింపుల నిరోధ‌క చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చిన ఆరేళ్ల‌లో ఇంత త్వ‌ర‌గా కేసును పూర్తి చేయ‌టం ఇదే తొలిసారిగా చెప్పాలి. అంతేకాదు.. ఘ‌టియా గ్రామంలో ఈ నెల 15న జ‌రిగిన అత్యాచారంపైనా ఐదు రోజుల వ్య‌వ‌ధిలోనే ద‌ర్యాప్తు పూర్తి చేసి నిందితుల‌ను కోర్టు ఎదుట హాజ‌రు ప‌ర్చారు. ఇదిలా ఉంటే.. అత్యాచారాలకు పాల్ప‌డిన మ‌రో ఇద్ద‌రు యువ‌కుల‌కు శిక్ష విధించిన విష‌యంలోనూ మాంద‌సౌర్ కోర్టులు వేగంగా వ్య‌వ‌హ‌రించాయి. ఎనిమిదేళ్ల బాలిపై జ‌రిపిన లైంగిక దాడి కేసులో ఇద్ద‌రు యువ‌కుల‌కు మ‌ర‌ణ‌దండ‌న విధిస్తూ.. సంచ‌ల‌న తీర్పును ఇచ్చారు. ఈ తీర్పుల‌న్ని స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే వెలువ‌రించ‌టం విశేషంగా చెప్పాలి.
Tags:    

Similar News