కోవిడ్ ఎఫెక్ట్.. భారత మందులను బ్లాక్ లో కొంటున్న చైనీయులు..!

Update: 2022-12-29 02:30 GMT
చైనాలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు కోట్లలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే చైనాలోని ఆస్పత్రులన్నీ కరోనా పేషంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. కనీసం రోగులకు బెడ్లు కూడా దొరకని పరిస్థితి చైనాలో ఉందనే కరోనా ఎంతలా విలయతాండవం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.

చైనాలో ఒమ్రికాన్.. బీఎఫ్ 7 వేరియంట్లు విజృంభిస్తున్నాయి. దీని ప్రభావంతో ప్రజలంతా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చైనాలో కోవిడ్ నివారణ మందుల కోసం ప్రజలు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ డ్రగ్స్ చైనాలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. చాలామంది ఎక్కువ డబ్బులు చెల్లించి మరీ బ్లాక్ మార్కెట్ కోవిడ్ మందులు కొంటున్నారు.

కరోనా రోగులకు తగినంత స్థాయిలో మందులు అక్కడ లభ్యం కావడం లేదు. చైనాలో డిమాండ్ తగిన సరఫరా కావడం లేదు. మరోవైపు చైనా కొన్ని మందులకు మాత్రమే అనుమతించింది. ఈ మందులు సైతం కొన్ని ప్రధాన ఆస్పత్రుల్లోనే దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది బ్లాక్ మార్కెట్లో.. ఎక్కువ ధర చెల్లించి మరీ కోవిడ్ డ్రగ్స్ కొంటున్నారు.

అయితే చైనాలో కోవిడ్ డ్రగ్స్ కొరత ప్రజలను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియాలో తయారైన జెనరిక్ మందులకు చైనాలో విపరీతమైన డిమాండ్ నెలకొంది. కోవిడ్ నివారణలో భారత మందులు అద్భుతంగా పని చేయడంతో వాటిని కొనుగోలు చేసేందుకు చైనీయులు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రైమవిర్.. పాక్సిస్టా.. మోల్నునాట్.. మోల్నాట్రిస్ వంటి పేర్లతో భారత్ కు చెందిన కోవిడ్ మందులను చైనాలో బ్లాక్ లో విక్రయిస్తున్నారు. ఎందుకంటే మన మందుల్నీ చైనా అక్కడ అనుమతించడం లేదు. కేవలం రెండు కంపెనీలకు చెందిన మందులను మాత్రమే ప్రభుత్వం అనుమతించింది.

ఈ క్రమంలోనే మన కోవిడ్ డ్రగ్స్ ను అక్రమంగా చైనాలో విక్రయిస్తున్నారు. అయితే ఇది అక్కడ చట్ట ప్రకారం నేరం. అయితే పరిస్థితుల్లో ఫార్మా కంపెనీలు లేబుల్స్ మార్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రభుత్వం ఈ మందులను కొనుగోలు చేయద్దని హెచ్చరిస్తునప్పటికీ చైనీయులు మాత్రం భారత మందులను బ్లాక్ లో కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. వీటితోపాటు ఇబూప్రోఫెన్.. పారాసెటమాల్ వంటి మందులను సైతం చైనీయులు కొనుగోలు చేస్తున్నారని భారత ఫార్మా కంపెనీలు పేర్కొంటున్నాయి. విదేశాల్లోని డిమాండ్ కు తగ్గట్టుగా మన ఫార్మా కంపెనీలు ఔషధాలను రెడీ చేస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News