ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గు ముఖం పడుతుంటే... వైరస్ పుట్టినిల్లు అయిన చైనా లో రోజు వారీ కేసు భారీగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులు కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. స్థానిక అధికార యంత్రాంగం ప్రకటించిన లెక్కల ప్రకారం కేవలం ఒక్క శుక్రవారం రోజు సుమారు పది మూడు వందలకు పైగా కేసులు వెలుగు చూసినట్లు పేర్కొన్నారు. సాధారణంగా చైనాలో ఒక్క రోజుకు వెయ్యికి పైగా కేసులు వెలుగు చూడటం అనేది చాలా అరుదు. కానీ శుక్రవారం కేసుల సంఖ్య ఏకంగా పదమూడు వందలకు చేరింది. ఇలి కేసులు భారీగా వెలుగు చూడటం గడిచిన రెండు సంవత్సరాల్లో ఇదే మొదటి సారి అని అధికారులు చెప్తున్నారు.
కేసులు ఒక్క సారిగా భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నెల కిందటి వరకు రోజువారీ కేసుల సంఖ్య వంద లోపు ఉండేది కానీ ఇప్పుడు ఒక్కసారిగా పెరిగి వెయ్యికి పైగా కేసులు వెలుగు చూస్తున్నాయని అన్నారు. ఈ కేసుల సంఖ్య భారీగా పెరగడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. చైనా ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 1369 మందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.
కానీ మరణాల సంఖ్య పై ఎటువంటి ప్రకటన చేయలేదు యంత్రాంగం. ఇదిలా ఉంటే చైనా లోని చాలా ప్రాంతాల్లో కోవిడ్ వ్యాప్తి భారీగా పెరిగినట్లు గుర్తించిన అధికారులు దీనిని అడ్డుకునేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. కొన్ని ప్రావిన్సులు లాక్డౌన్ విధించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
చైనాలోని ఈశాన్య ప్రాంతంలో ఉండే చాంగ్ చున్ నగరంలో కొవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ప్రదేశాల్లో లాక్డౌన్ అమలుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతంలో శుక్రవారం నుంచి లాక్ డౌన్ అమలులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 90 లక్షలకు పైగా జనాభా ఉన్న చాంగ్ చున్ నగరంలో ఇప్పటికే వ్యాపార సముధాయాలను మూసివేసినట్లు చెప్పారు.
ప్రజా రవాణా వ్యవస్థను కూడా స్తంభింప చేసినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు కేవలం ఇంట్లోనే ప్రజలు ఉండాలని సూచించారు. మరోవైపు కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు నగరంలో వైరస్ పరీక్షలను మరింత వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు బాగా తగ్గాయి. కొత్తగా 16 లక్షల కేసులు నమోదు అయ్యాయి. జర్మనీ, సౌత్ కొరియా ల్లో మాత్రం వైరల్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు భారత్ లో కూడా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి.