ప్రపంచ ప్రజల్ని వణికిస్తున్న కరోనా విషయంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించే వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్నటి మీడియా సమావేశంలో స్పష్టం చేయటం తెలిసిందే. ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారిక సమాచారం తప్పించి.. ఏదో తెలిసింది.. సమాచారం.. విశ్వసనీయ వర్గాల కథనం.. లాంటి వాటికి చెక్ పెట్టాలని కేసీఆర్ చెప్పేశారు. మీడియాతో పాటు.. సోషల్ మీడియాకు తీవ్రమైన వార్నింగ్ ఇచ్చేశారు.
అసత్యాలు.. అవాస్తవమైన వార్తల్ని పోస్టు చేసిన వారిని గుర్తించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెబితే.. ఆ చర్యల తీవ్రత ఎంతలా ఉంటుందో చెప్పి షాకిచ్చారు హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్. కరోనా వైరస్ పై వైరల్ పోస్టులను.. తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తే జాతీయ విపత్తు నిర్వహణ మండలి చట్టం 5.1 ప్రకారం కేసులు నమోదు చేస్తామని చెబుతున్నారు .
ఈ కేసు కింద ఏడాది పాటు జైలుశిక్షకు అవకాశం ఉందన్నారు. కరోనా వైరస్ పై తప్పుడు వార్తలు.. వదంతులు వ్యాపింపచేయటం ఏ మాత్రం సరికాదన్నారు. అలా చేసిన వారిపై విపత్తు నిర్వహణ మండలి చట్టం 5.1 ద్వారా కేసులు నమోదు చేస్తామన్నారు. తప్పుడు వార్తల కారణంగా ప్రజలకు భయాందోళనలు.. గురి కావాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వైరస్ పై తప్పుడు వార్తలు రాసి వదంతులు విడుదల చేసిన వారిని చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. కరోనాపై భయం పెరిగితే.. ప్రజలు భీతి చెందే వీలుందన్నారు. ఏమైనా.. సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా సమాచారాన్ని నిలువరించేందుకు వీలుగా తాజా ప్రకటనను హైదరాబాద్ సీపీ విడుదల చేసి ఉంటారని భావిస్తున్నారు.