ఏపీలో ఇపుడు ఏ నోట విన్నా న్యూడ్ వీడియో చుట్టే తిరుగుతోంది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురించే మాట్లాడుతున్నారు. ఇంతలా ప్రాచుర్యం పొందిన న్యూడ్ వీడియో బహుశా మరోటి ఉండదేమో. తీర చూస్తే అది ఒక మేల్ న్యూడ్ వీడియో అని చెబుతున్నారు. అయినా సరే ఎంపీ గారు. పార్లమెంట్ మెట్లెక్కిన పుణ్యమూర్తి గారిది అది అని చెప్పబడుతోంది కాబట్టే దానికి అంత పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంది.
హిందూపురం ఎంపీ గారి న్యూడ్ వీడియో ఫేక్. ఒరిజినల్ కానే కాదు అంటూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప పక్కా క్లారిటీగా తేల్చేశాక ఇక ఏముంటుంది. కధ కంచికే అని అంతా అనుకున్నారు. కానీ అక్కడే అసలు కధ స్టార్ట్ అయింది. ఎంపీ గారి చెప్పిన మాటలకు, ఎస్పీ గారి మాటలకు పొంతల లేదు, సాక్షాత్తూ హోం మంత్రి తానేటి వనిత చెప్పిన విషయాలకు ఆమె పోలీస్ శాఖలో అధికారులు చెబుతున్న విషయాలకు అసలు పోలిక లేదు.
ఇలా ప్రభుత్వం పోలీసుల మధ్య ఏ మాత్రం కుదరని పొత్తుగా ఈ వ్యవహారం తయారు అయితే విపక్షాలకు ఇంతకు మించి ఆయుధం ఏముంటుంది. ఏది చెప్పినా అతికినట్లుగా ఉండాలి. కానీ హోం మంత్రి గారేమో గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపాను నివేదిక వస్తే చర్యలు అంటారు. మరో వైపు ఎస్పీ ఫకీరప్ప అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు ఏవీ ఒరిజినల్ కావని అంటున్నారు. అలాంటపుడు దేనిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపుతామని కూడా ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు.
ఇక న్యూడ్ వీడియో అంటూ ఒకటి బయటపడిన వెంటనే అది తనది కాదు అంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పిన ఎంపీ గోరంట్ల మాధవ్ దీని మీద పూర్తి విచారణ జరపమని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కానీ ఆయన ఫిర్యాదు చేసినట్లుగా ఎక్కడాలేదుమరి. ఇలా పొంతన లేని మాటలతో ప్రభుత్వ పెద్దలు ఒక వైపు ఉంటే మరో వైపు న్యూడ్ వీడియో గుట్టుని కేవలం వారమంటే వారం రోజుల్లో రట్టు చేసిన ఫకీరప్పే ఇపుడు హీరో అయిపోయారు.
అందుకే ఆయనకు ఆగస్ట్ 15న జరిగిన వేడుకల్లో గోల్డ్ మెడల్ ఇవ్వాలని సీపీఇ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ కోరడం విడ్డూరం అనిపించుకోదు, వెటకారం అనుకుంటే మాత్రమే తప్పు అనిపించవచ్చేమో. ఇంతటి వీర లెవెల్ పరిశోధన చేసిన తరువాత ఆ ఎస్పీకి బంగారు పతకం ఇవ్వకపోతే ఎట్టా అని కామ్రెడ్ అంటూంటే సర్కార్ పెద్దలు కూడా ఏమైనా ఆ దిశగా ఆలోచిస్తారేమో అన్న డౌట్లు కూడా వస్తున్నాయట. ఏది ఏమైనా ఒక్క విషయం మాత్రం స్పష్టం. ప్రభుత్వ వ్యవస్థలోనే ఎక్కడో క్లారిటీ అయితే మిస్ అయింది.
విషయం మాత్రం ఓపెన్ గా ఉంది. దాంతో ఈ న్యూడ్ వీడియో ఎపిసోడ్ నుంచి బయటపడలేక పడుతున్న పాట్లు సర్కార్ పెద్దల ఫీట్లు అని విపక్షాలు అంటున్నాయి. సరే న్యూడ్ వీడియో సంగతేమో కానీ ముందు గోల్డ్ మెడల్ ఇవ్వాలన్న దాని మీద అయితే తెగ ట్రోల్ అవుతోందిట.