తెలుగు నేలపై కమ్యూనిస్టులు స్వాతంత్యం వచ్చిన కొత్తలో బలమైన పార్టీగా ఉండేవారు.. 1952నుంచి కాంగ్రెస్ ను అడ్డుకొని కమ్యూనిస్టులు సత్తాచాటారు. కాంగ్రెస్ తో సమానంగా కామ్రేడ్లు దూసుకుపోయారు. కానీ 1967 ఎన్నికల తర్వాత కమ్యునిస్టులు పట్టుకోల్పోయారు. దీనికి కారణం వారి చీలికే.. 1964లో కమ్యూనిస్టు పార్టీ సీపీఐ - సీపీఎం గా చీలిపోవడమే ఆ పార్టీ పతనానికి దారి తీసింది.
1967 ఎన్నికల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. విడిపోయాక ఏపీలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్రుల కన్నా తక్కువ సీట్లను కమ్యునిస్టులు సాధించారు. కామ్రేడ్ల చీలికతో తెలంగాణలో అతిపెద్ద పార్టీగా ఉన్న కమ్యూనిస్టులు అస్తిత్వం కోల్పోయారు. ఉద్యమాల ద్వారా పట్టుసాధించిన ఆంధ్రప్రదేశ్ లోనూ దిగజారిపోయారు.. అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం అశేష మేజారిటీతో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 1967లో మొత్తం 287సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసింది. 165 స్థానాల్లో నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 7 సీట్లలోనే డిపాజిట్లు కోల్పోయింది. 104 సీట్లకు పోటీచేసిన సీపీఐ 47 చోట్ల - 87 స్థానాల్లో బరిలోకి దిగిన సీపీఎం 26 చోట్ల డిపాజిట్లు కోల్పోయాయి. ఈ ఎన్నికల్లో సీపీఐ 11 - సీపీఎం 9 సీట్లను మాత్రమే గెలుచుకొని బొక్కా బోర్లాపడ్డాయి.
అలా విడిపోయాక బలమైన కమ్యూనిస్టు పార్టీ ఏపీ రాజకీయ ముఖచిత్రంపై కనుమరుగవుతూ వస్తోంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ పది సీట్లలోపే గెలుస్తూ వచ్చింది. పోయిన 2014 ఎన్నికల్లో ఏపీలో ఒక్క సీటు దక్కించుకోకపోగా.. తెలంగాణ లో సీపీఐ 1 - సీపీఎం 1 స్థానం మాత్రమే దక్కించుకొని రెండు సీట్లకు పరిమితమయ్యారు. ఇలా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ తర్వాత బలమైన పక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు తన అస్థిత్వాన్ని వెతుక్కోవడానికి కష్టపడుతోంది.