పవన్ కల్యాణ్ తో సీట్ల చర్చ విషయంలో కూర్చోవాలని కమ్యూనిస్టు పార్టీలు చాలా కాలం నుంచినే ప్రయత్నిస్తూ ఉన్నాయి. దాదాపు రెండు నెలల నుంచి ఈ విషయం లో చర్చల పట్ల కమ్యూనిస్టు పార్టీల నేతలు ఉత్సాహం చూపించారు. అప్పట్లో ఈ విషయం గురించి కమ్యూనిస్టు పార్టీలు మీడియాతో తమ అంచనాలను పంచుకున్నాయి.
ఏకంగా అరవై ఎమ్మెల్యే సీట్లు తమకు కేటాయించాలని తాము పవన్ కల్యాణ్ ను కోరనున్నట్టుగా సీపీఐ - సీపీఎం నేతలు చెప్పడం గమనార్హం. గత మూడు దశాబ్దాల చరిత్రలో ఉమ్మడి ఏపీలో కూడా ఎప్పుడూ కమ్యూనిస్టు పార్టీలు అన్ని స్థానాల్లో పోటీ చేసిన దాఖలాలు లేవు. బహుశా గత సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏ ప్రధాన పార్టీతోనూ పొత్తు లేకుండా పోటీ చేశాయి కాబట్టి.. ఉమ్మడి ఏపీలో అన్ని సీట్లలో కమ్యూనిస్టు పార్టీల తరఫున అన్ని సీట్లకు నామినేషన్స్ దాఖలు అయి ఉండవచ్చు.
అయితే ఎవరో ఒకరితో పొత్తుతో వెళితే మాత్రం ఉభయ కమ్యూనిస్టు పార్టీల తరఫున అన్ని స్థానాల్లో నామినేషన్లు దాఖలు అయిన చరిత్ర లేదు. అలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలు పవన్ కల్యాణ్ నుంచి మాత్రం ఏకంగా అరవై స్థానాలు ఆశించారు.
జనసేన పార్టీ తమకు అరవై సీట్లు కేటాయించి పొత్తుకు ఒప్పుకోవాలని, వాటిలో తాము చెరో ముప్పై పంచుకుంటామని కమ్యూనిస్టు పార్టీలు అప్పుడు ప్రకటించాయి! మరీ అరవై సీట్లా.. అని అప్పుడే చాలా మంది ఆశ్చర్యపోయారు. అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి పరిణామాలు.
అప్పుడు అరవై సీట్లు అడిగిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఆ నంబర్ ను బాగా తగ్గించి వేశాయి. సగానికి తగ్గించి వేశాయి, అంతకన్నా తగ్గించి వేశాయి. కేవలం ఇరవై ఆరు సీట్లు కేటాయిస్తే చాలు పొత్తు అని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు పవన్ నుకోరుతున్నాయి.
రెండు నెలల్లో వీళ్లు అరవై నుంచి ఇరవై స్థాయిలోకి వచ్చేయడం విశేషమే, విడ్డూరమే. ఇప్పుడు చర్చ ఏమిటంటే.. వీరు అడుగుతున్నదే ఇరవై ఆరు అంటే పవన్ ఇచ్చేవి ఎన్ని ఉంటాయి? అనేది. తమకు కొద్దో గొప్పో ఆశలున్న ఏ నియోజకవర్గాన్ని కూడా పవన్ కమ్యూనిస్టు పార్టీలకు కేటాయించే అవకాశాలు లేవని స్పష్టం అవుతోంది!