కమ్యూనిస్టు నేతలు ఇంట్లో ఎన్ని పూజలు చేసినా బహిరంగంగా దేవాలయాలకు వెళ్లడం మాత్రం అరుదు. కానీ, మిగిలినవారికి భిన్నంగా సీపీఐ జాతీయ నేత నారాయణ మాత్రం అప్పుడప్పుడూ తిరుపతి వెంకన్న దర్శనానికి వస్తుంటారు. తాజాగా ఈరోజు కూడా ఆయన వెంకన్న దర్శనం చేసుకున్నారు. స్వామిని దర్శించుకున్నఅనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. మీడియావాళ్లు అడగకముందే ఆయనే వివరణ కూడా ఇచ్చేశారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకే శ్రీవారిని దర్శించుకున్నానని.. గతంలో చాలా సార్లు తిరుమలకు వచ్చినా.. వెంకటేశ్వరుడిని దర్శించుకోలేదని చెప్పారు. కానీ ఈ సారి మాత్రం కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో తప్పలేదన్నారు.
అనంతరం రాజకీయాలవైపు మాటలు మళ్లించారు. పెద్దలంతా సర్దేసుకున్న తర్వాతే పెద్ద నోట్ల రద్దు ప్రకటన వచ్చిందని నారాయణ విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో బడాబాబుల సంగతేమో గానీ, సామాన్యులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారని నారాయణ అన్నారు.
తిరుమల వెంకన్నకు బడాబాబులు సమర్పించే నగదు - నగలు అన్నీ బ్లాక్ మనీనేనని ఆయన అన్నారు. హుండీకి వస్తున్న ఆదాయం చూస్తే ఆవిషయం అర్థమవుతుందన్నారు. వేల కోట్ల అవివీతికి పాల్పడిన వ్యక్తిని ఆర్ బీఐ గవర్నర్ గా నియమించారని విమర్శించారు. ఇంతకు ముందు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానికీ ఆర్థిక సలహాదారుగా ప్రస్తుతం ఆర్ బీఐ గవర్నర్ పనిచేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/