రిల‌య‌న్స్ దోపిడిని బ‌య‌ట‌పెట్టిన నారాయ‌ణ‌

Update: 2016-12-26 04:16 GMT
విష‌యం ఏదైనా విమ‌ర్శ చేయ‌డమే కాకుండా లోతైన విశ్లేష‌ణ కూడా చేసే సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ తాజాగా రిల‌య‌న్స్ పెట్రోల్ బంకుల‌పై గురిపెట్టారు. రిల‌య‌న్స్‌ కు చెందిన పెట్రోలు బంకుల్లో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఎండ‌గడుతూ నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రిలయన్స్ ఆయిల్ కంపెనీ ఒక లీటర్ కు ఒక రూపాయి తగ్గిస్తూ బ్యానర్లు కట్టి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాద‌ని ఈ హఠాత్ పరిణామంతో భారత ప్రభుత్వ ఆయిల్ కంపెనీలకు తీరని నష్టం వాటిల్లుతోంద‌ని నారాయ‌ణ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పబ్లిక్ సెక్టార్లో ఆయిల్ వ్యాపారం విస్తృతంగా జరుగుతున్న నేప‌థ్యంలో ఆయా ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల‌ను కాపాడాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వానిదేన‌ని తేల్చిచెప్పారు. అయితే రిలయన్స్ కంపెనీ బరి తెగింపున‌కు కారణం మోడీ ప్రభుత్వానికి, రిలయన్స్ సంస్థకు ఉన్న విడదీయరాని అవినాభావ సంబంధమ‌ని నారాయ‌ణ విమ‌ర్శించారు.

భారతీయ మానస పుత్రులమని చెప్పకునే సంఘ్ పరివార్ ప్రభుత్వం స్వదేశీ ఆర్థిక వ్యవస్థను దెబ్బగొట్టి బ్రిటీష్ పెట్రోలియం కంపెనీకి 3500 రిటైల్ బంకులు - రస్ నెఫ్ట్ కంపెనీకి 2000 రిటైల్ బంకులకు భారత ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చేసినా ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌ని నారాయ‌ణ సూటిగా ప్ర‌శ్నించారు. స్వదేశీ రిలయన్స్ - విదేశీ కంపెనీలకు అవకాశమివ్వడం ద్వారా అపార సేవ చేస్తున్న ఇండియన్ ఆయిల్ కంపెనీలను దివాళా తీయించే స్థాయికి దిగజారుస్తున్న మోడీ ప్రభుత్వం ఎవరికి భక్తులని నారాయ‌ణ ప్ర‌శ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు ఊడిగం చేసే విధానానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News