నిన్న పార్లమెంటు ముందుకు వచ్చిన కేంద్ర సాధారణ బడ్జెట్ పై దేశంలోని ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న దాఖలా కనిపించడం లేదు. బీజేపీ - ఆ పార్టీకి మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు - ఆయా పార్టీల నేతలు మినహా ఏ ఒక్క వర్గం కూడా అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను మెచ్చుకున్నట్లుగా ఎక్కడ కూడా వార్తలు వినిపించలేదు. ఇక ఏ పార్టీ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టినా... పెదవి విరవడం మినహా మరోమా మాట్లాడని వామపక్షాలు జైట్లీ బడ్జెట్ పై మరింత ఘాటు విమర్శలు చేశాయి. తెలుగు నేలకు చెందిన సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ కాసేపటి క్రితం విశాజయవాడలో మీడియాతో మాట్లాడుతూ జైట్లీ బడ్జెట్ తో పాటు పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోదీపై ఘాటు విమర్శలు చేశారు. పెద్ద నోట్లను రద్దు చేసి దేశ ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన మోదీ... వచ్చే ఎన్నికల్లో చెల్లని నోటుగా మారడం ఖాయమని నారాయణ జోస్యం చెప్పారు.
ఒక్క ప్రధాని పైనే కాకుండా ఏకంగా మొత్తం బీజేపీ నేతలను, ఆ పార్టీ ప్రభుత్వం పాలనను ఎద్దేవా చేస్తూ నారాయణ తనదైన శైలిలో సెటైర్లేశారు. అసలు నారాయణ చేసిన వ్యాఖ్యల విషయానికొస్తే... జైట్లీ బడ్జెట్ ఫెయిల్. డబ్బున్నవారంతా తెల్లదొరలుగా మారారు. ట్రంప్ చర్యలతో మనకేమీ కాదనే భరోసాను ఇవ్వడంలో మోదీ సర్కారు ఘోరంగా విఫలమైంది. రాజకీయంగా ఎన్డీఏ ఫెయిల్ అయ్యింది. మతాల పేరిట దేశ ప్రజలను బీజేపీ సర్కారు రెచ్చగొడుతోంది. 2019లో మోదీ చెల్లని నోటుగా మారిపోవడం ఖాయం. బడ్జెట్ లో అమరావతి రైతులకు ఇచ్చినట్లుగానే పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలి. ముందుగా బీజేపీ నేతల ఆస్తులు, అకౌంట్లు ప్రకటించాలి. ఆ తర్వాతే పార్టీల విరాశాల గురించి మాట్లాడితే బాగుంటుంది... అని నారాయణ తనదైన శైలిలో బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/