మోడీ ముద‌న‌ష్ట‌పు ప్ర‌ధాన‌మంత్రి

Update: 2016-12-01 05:02 GMT
ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీపై సీపీఐ అగ్ర‌నేత‌లు మండిప‌డ్డారు. తెలంగాణ‌లో సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభల ముగింపు సందర్భంగా  సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి  - సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మోడీపై విరుచుకుప‌డ్డారు.పెట్టుబడిదారులకు ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఊడిగం చేస్తున్నారని, వారి నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి తెలిపారు. ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విలోకి మోడీ వచ్చాకే అంబానీ - అదానీ - ఐటీసీ - మహేంద్ర - టాటా వంటి పది కంపెనీలకు పది లక్షల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. విజయ్‌ మాల్యా - లలిత్‌ మోదీ వంటి వాళ్లు కుంభకోణాలు చేసి విదేశాలకు పారిపోతున్నా ఎందుకు పట్టుకోవడం లేదని సుర‌వ‌రం ప్రశ్నించారు.

 ప్రజలు ఆన్‌ లైన్ ద్వారా లావాదేవీలు జరపాలని మోడీ సూచించటం మెడమైన తలకాయ లేని వ్యక్తి చెప్పే మాటలుగా సుర‌వ‌రం అభివర్ణించారు. దేశంలో ఎన్ని గ్రామాల్లో బ్యాంకులు ఉన్నాయి, ఉన్న బ్యాంకులకు పూర్తిస్థాయిలో ఈ సేవలు అందించే సామర్థ్యం ఉందా - ఎంతమంది ప్రజలకు ఆన్‌ లైన్ లావాదేవీలపై అవగాహన ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రత్యామ్నాయాలు చూపకుండా రూ.500 - 1000నోట్లను రద్దు చేసి సామాన్యులను ఇబ్బందుల్లోకి నెట్టారని సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి ఆరోపించారు. ఆర్‌ ఎస్‌ ఎస్ - సంఘ్‌ పరివార్ ఏజెంట్‌ గా మోడీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్మిక చట్టాలను సవరిస్తూ - పేదలపై పన్ను భారం మోపుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌ లో నిలదీస్తే దేశద్రోహం ముసుగువేసి అణచివేస్తున్నారని విమ‌ర్శించారు. పెద్దనోట్ల సమస్య పెద్దగా లేదని - బ్యాంకుల వద్ద - ఏటిఎంల వద్ద రద్దీ తగ్గిపోయిందని, ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రధాన మోడీ - కేంద్రమంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి బ్యాంకులలో - ఏటిఎంలలో డబ్బులు లేక పనిచేయని పరిస్థితుల్లో ప్రజలు వాటివద్దకు ఎందుకు వెడతారని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు విషయంలో సామాన్య ప్రజల్లో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోందని, ఇదికాస్తా ఆగ్రహంగా మారేందుకు ఎక్కువ సమయం పట్టదని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్న విధానాల వల్ల ధనికలు - పేదల మధ్య అంతరం భారీగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసారు.

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ మాట్లాడుతూ  ప్రపంచవ్యాప్తంగా వామపక్షాలకు బలం ఉందని, అమెరికాలో సైతం వామపక్షాల హవా కొనసాగుతున్నదన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక రూ.15 లక్షల కోట్లు విదేశాలకు పంపించారని  ఆరోపించారు. మోడీ మొదనష్టపు ప్రధాని అని మండిపడ్డా రు. ఈ మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి చాడ వెంకట్‌రెడ్డిని ఎన్నుకున్నారు. ఇద్దరిని రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఆరుగురిని, 20 మందిని కార్యవర్గ సభ్యులుగా, మరో ఇద్దరిని ఆహ్వానితులుగా ఎన్నుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News