అరేరె.. బోటు మృతుల్లో నారాయ‌ణ బంధువులు

Update: 2017-11-13 09:54 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ షాకింగ్ గా మారిన కృష్ణా న‌ది బోటు బోల్తా ఉదంతం  విషాదంలో నింపింది. అప్ప‌టి వ‌ర‌కూ ఆట‌పాట‌ల‌తో స‌ర‌దాగా గ‌డిపినోళ్లంతా ఒక్క‌సారిగా తిరిగిరాని లోకాల‌కు వెళ్ల‌టం ప‌లువురిని క‌లివేసేలా చేసింది. బోటు య‌జ‌మాని క‌క్కుర్తి.. ప్ర‌యాణికుల తొంద‌ర‌పాటే ఈ భారీ విషాదానికి కార‌ణంగా చెబుతున్నారు.

ఈ విషాదంలో కామ్రేడ్ సీపీఐ నారాయ‌ణ బంధువులు కూడా చ‌నిపోయారు. త‌న భార్య త‌ర‌ఫు బంధువులైన ముగ్గురు మ‌హిళ‌లు మృతి చెందిన‌ట్లుగా నారాయ‌ణ వెల్ల‌డించారు ఈ దుర్ఘ‌ట‌న వెనుక నిర్వ‌హ‌ణ లోపమేన‌ని.. సామ‌ర్థ్యానికి మించిన ప్ర‌యాణికుల్ని బోటు ఎక్కించ‌టంతోనే ప్ర‌మాదానికి కార‌ణంగా ఆయ‌న వ్యాఖ్యానించారు.  

బాబు స‌ర్కారు తీరును త‌ప్పు ప‌ట్టిన నారాయ‌ణ‌.. అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ లోపం కూడా చోటు చేసుకుంద‌ని విమ‌ర్శించారు. ప్ర‌మాదంలో మృతి చెందిన కుటుంబాల‌కు రూ.25 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

ఏమైనా.. ఈ విషాదం రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల‌కు.. ప్ర‌భుత్వాల‌కు మేలుకొలుపుగా మారి.. ప‌ర్యాట‌క ప్రాంతాల్లో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేయ‌టంతో పాటు.. నిబంద‌న‌ల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేలా చ‌ట్టాల్లో మార్పులు తీసుకురావాల్సి ఉంది. లేనిప‌క్షంలో రానున్న రోజుల్లో ప‌ర్యాట‌క ప్రాంతాలు అపాయ‌క‌ర‌మైన్న సందేశం ప్ర‌జ‌ల్లోకి వెళ్లే ప్ర‌మాదం ఉంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.
Tags:    

Similar News