గ్రేటర్ ఎన్నికల ప్రచారం మాటకు మాట అన్నట్లుగా మారింది. సీపీఐ నారాయణ ఈ మధ్య మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ కానీ ఒంటరిగా గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధిస్తే తన చెవులు కోసుకుంటాని వ్యాఖ్యలు చేయటం.. దీనికి కౌంటర్ గా శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తనకో మంచి దోస్త్ ఉన్నారని.. ఒంటరిగా పార్టీ గెలిస్తే చెవులు కోసుకుంటానని చెప్పారని.. అందుకు ఫిబ్రవరి 5న హైదరాబాద్ లో ఉండొద్దని.. ఎవరైనా చెవులు కోస్తే తామే ఈఎన్ టీ ఆసుపత్రుల్లో చేర్పించాల్సి ఉంటుందని కేసీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై తాజాగా నారాయణ స్పందించారు. తాను ఫిబ్రవరి 5న ఎక్కడికి వెళ్లనని.. హైదరాబాద్ లోనే ఉంటానని భయపడి పారిపోనని స్పష్టం చేశారు. మంచి మిత్రుడని కేసీఆర్ చెబుతూనే.. పరోక్షంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం కేసీఆర్ కు మంచిది కాదని హితవు పలికారు. ప్రజల పేరుతో తనపై రెచ్చగొట్టాలనే కుటిల ప్రయత్నం మానుకొని.. హుందాగా వ్యవహరించాలని సలహా ఇస్తున్నా అంటూ నారాయణ వ్యాఖ్యానించారు.