తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్కు భవిష్యత్తు అధినేతగా, సత్తా కలిగిన రాజకీయ వేత్తగా తనను తాను ఇప్పటికే నిరూపించుకున్న ఆ పార్టీ యువనేత, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) పాలనలో తనదైన సత్తాను చాటుతున్నారు. ఏ శాఖను తనకు అప్పగించినా... దానిపై అతి స్వల్ప కాలంలోనే పట్టు సాధించడంతో పాటు సదరు శాఖ పనితీరు బుల్లెట్లా దూకుసుకోయేలా పనిచేస్తున్నారు. పాలనలో ఓ వైపు సత్తా చాటుతూనే రాజకీయంగా కూడా ఆయన తనదైన మార్కును చూపిస్తున్నారు. మరోవైపు ప్రత్యక్ష ఎన్నికలకు జడిసో, మరే కారణమో తెలియదు గానీ... ఓ పార్టీకి అధినేతగానే కాకుండా ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కీలక నేత కుమారుడిగా ఉంటూ కూడా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా పరోక్ష ఎన్నికల ద్వారా శాసన మండలిలో అడుగుపెట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ అంశంపైనా ఇప్పటికే పెద్ద సంఖ్యలో సెటైర్లు పడిపోయాయి. చిన్న చిన్న అంశాలపైనే పట్టు లేని నారా లోకేశ్ లాంటి వాళ్లు మంత్రులుగా అయితే ఇక పాలన ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చంటూ... విపక్షాలు సెటైర్ల మీద సెటైర్లు వేసేస్తున్నాయి.
ఈ క్రమంలో ఏ రాజకీయ నేతపై అయినా అలవోకగా సెటైర్లు సంధించే సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ నిన్న ఒంగోలు జరిగిన ఓ కార్యక్రమంలో అటు కేటీఆర్ తో పాటు ఇటు నారా లోకేశ్ పై అదిరిపోయే సెటైర్ సంధించారు. ఇప్పుడిప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వీరికి తాను ఎవరో తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నారాయణ... ఆ ఇద్దరు యువ నేతలను కొత్త బిచ్చగాళ్లుగా అభివర్ణించారు. నారాయణ ఎవరో నాకు తెలియదంటూ కేటీఆర్ చేసిన కామెంట్లను ప్రస్తావించిన నారాయణ... తానెవరో తెలియాలంటూ మీ నాన్నను అడిగితే చెబుతారంటూ చురక అంటించారు.
ఇక నారా లోకేశ్ విషయానికి వస్తే... విజయవాడలో అభివృద్ది జరగకపోవడానికి కమ్యూనిస్టులే కారణమంటూ గతంలో లోకేశ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ కామెంట్‌ను ప్రస్తావించిన నారాయణ... లోకేశ్ తన తండ్రి చంద్రబాబును అడిగితే... కమ్యూనిస్టులు ఎవరో చెబుతారంటూ సెటైర్ వేశారు. సుదీర్ఘ కాలంగా ప్రజల పక్షాన పోరాటాలు సాగిస్తూ... అధికారంలో ఉన్నది ఏ పార్టీ అన్న దానితో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమమే ముందుకు సాగుతున్న తమపై విమర్శలు గుప్పించే వాళ్లను కొత్త బిచ్చగాళ్లు అనక ఇంకేమనాలని కూడా నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి నారాయణ వ్యాఖ్యలపై ఇద్దరు యువ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.