నారాయ‌ణ‌కు కేసీఆర్ షాక్‌

Update: 2015-11-10 16:38 GMT
జీహెచ్‌ ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపు ఆంశం ర‌చ్చ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. కావాల‌నే ఓట్లు తొల‌గించార‌ని...భారీ స్థాయిలో ఓట్ల గ‌ల్లంతు వెన‌క అధికార టీఆర్ఎస్ పార్టీ హ‌స్తం ఉంద‌ని టీడీపీ-బీజేపీ - కాంగ్రెస్‌ లు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ లిస్ట్‌ లోకి సీపీఐ వ‌చ్చి చేరింది. పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి - సీపీఐ సీనియర్‌ నేత నారాయణ దంపతుల ఓట్లను అధికారులు తొలగించారు. దీంతో హైదరాబాద్‌ లో ఓట్ల తొల‌గింపు మ‌రోసారి వివాదాస్పదమైంది.

నారాయ‌ణ బషీర్‌ బాగ్‌ లోని బీఎన్‌ రెడ్డి టవర్స్ ప్లాట్‌ నెం.104లో నివాసముంటున్నారు. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా కూడా త‌న ఓటు హ‌క్కును ఇక్క‌డే వినియోగించుకున్నారు. అయితే తాజాగా ఓటరు జాబితాలో తనపేరు లేకపోవడాన్ని చూసి నారాయణ అవాక్కయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఓట్ల తొలగింపులో అక్రమాలు జరుగుతున్నాయనడానికి తన ఓటు తొలగింపే నిదర్శనమన్నారు. ఓటు తొల‌గింపుపై జీహెచ్‌ ఎంసీ అధికారులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిష్ప‌క్షపాతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన వ్య‌వ‌స్థ‌ల్లో ప్ర‌భుత్వం జోక్యం చేసుకుంటే జ‌రిగేది ఇదేన‌ని అన్నారు.
Tags:    

Similar News