సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ టీడీపీ నేతల తీరును తీవ్రంగా ఆక్షేపించారు. సంక్రాంతి సందర్భంగా టీడీపీ నేతలు విచ్చలవిడితనానికి తెగబడ్డారని ఆరోపించారు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోడిపందాలు జరిపారని.... వేల కోట్లు బెట్టింగ్ కు పాల్పడ్డారని కే.రామకృష్ణ ఎండగట్టారు. బుధవారం మీడియతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో విచ్చలవిడిగా కోడిపందాలు, వేల కోట్ల బెట్టింగ్ లు జరుగుతున్నా రాష్ట్ర హోంమంత్రి పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలిగేలా టీడీపీ నేతల పాలన ఉందని విమర్శించారు.
చంద్రబాబు తీరు కూడా ఎబ్బెట్టుగా ఉందని కే. రామకృష్ణ ఫైర్ అయ్యారు. తన స్నేహితుడు , మాజీ సీఎం కూతురు , ప్రతిపక్ష నేత చెల్లెలు షర్మిల తనపై టీడీపీ నేతలు అసభ్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఆమె రాజకీయం చేస్తోందని చంద్రబాబు మాట్లాడడం సరికాదన్నారు.షర్మిల మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కే.రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఒక మహిళగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి షర్మిల ఫిర్యాదు చేశారంటే ఆమె ఎంత బాధపడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చని కే రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు.. షర్మిల విషయంలో వ్యవహరించేది ఇలాగేనా అని విమర్శించారు.