మొన్నటివరకూ పాలునీళ్లలా కలిసిపోయిన జనసేన-కమ్యూనిస్టుల మధ్య పొరపొచ్చాలు వచ్చినట్టు కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల వేళ రాసుకుపూసుకు తిరిగిన పవన్ కళ్యాణ్-సీపీఐ రామకృష్ణలు తాజాగా వేరుపడ్డట్టు కనిపిస్తోంది.
తాజాగా సీపీఐనేత రామకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దారుణ వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలవడానికి ఢిల్లీలో మంతనాలు జరుపుతున్న పవన్ తీరును కడిగేశారు. 2019 ఎన్నికల సమయంలో వామపక్ష భావజాలతో వచ్చానన్న పవన్.. ఇప్పుడు బీజేపీ ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. పవన్ పదే పదే తనకు చెగువేరా ఆదర్శమని అంటారని.. చెగువేరా కాస్తా ఇప్పుడు ‘చెంగువేరా’ అయ్యాడని ఆడిపోసుకున్నారు. మతోన్మాద బీజేపీతో పోరాడలేక పవన్ పారిపోయాడని ధ్వజమెత్తారు. పవన్ దమ్ములేదని మండిపడ్డారు.
ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్న పవన్.. ఇప్పుడు నడ్డాను కలుస్తూ బందరు లడ్డూలు ఇచ్చాడంటూ సీపీఐ రామకృష్ణ సెటైర్ వేశారు.